స్క్రాచ్ కార్డు దానం చేసిన యువతి.. బిచ్చగాళ్లకు రూ.43 లక్షలు..

  • Published By: nagamani ,Published On : October 10, 2020 / 12:49 PM IST
స్క్రాచ్ కార్డు దానం చేసిన యువతి.. బిచ్చగాళ్లకు రూ.43 లక్షలు..

అదృష్టవంతుల్ని చెడగొట్టేవారు..దురదృష్టవంతుల్ని బాగుచేసేవారు ఎవ్వరూ ఉండరంట..అనే సామెత ఎంత నిజమో ఓ యువతి..కొంతమంది బిచ్చగాళ్ల గురించి వింటే అర్థమవుతుంది. చిచ్చమెత్తుకునే బిచ్చగాళ్లకు డబ్బులే వేయాలి..అదే వారికి కావాల్సింది కూడా.



కానీ ఓ యువతి తన దగ్గర డబ్బులు లేకో..లేదో దీనికేమొస్తుంది ఒట్టి గీకుడు తప్ప అని అనుకుందో…లేదా తనను బిచ్చమడిగినవాళ్లకు లక్ ఉంటే అదృష్టం కలిసి వస్తుందిలే అనుకుందోగానీ..ఓ స్క్రాచ్ కార్డును బిచ్చగాళ్లకు ఇచ్చేసి చక్కా వెళ్లిపోయింది. ఆ కార్డుకు ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.43 లక్షలు వచ్చాయి. దీంతో సదరు బిచ్చగాళ్లంతా ఫుల్ హ్యాపీ హ్యాపీగా గంతులేసిన ఘటన ఫ్రాన్స్ లో జరిగింది.



ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్ నగరంలో నలుగురు యాచకులు (ముగ్గురు పురుషులు, ఒక మహిళ) బిచ్చమెత్తుకుంటున్నారు. ఎంతోకాలంగా వాళ్లు అలాగే బతుకుతున్నారు. ఓ రోజు తమ ప్రతీరోజు చేసే పనిలో భాగంగా యాచిస్తున్నారు. అలా వారు ‘లాటరీ షాప్‌ వద్ద వీరు యాచిస్తుండగా ఓ యువతి ఒక యూరో వెచ్చించి కొనుగోలు చేసిన స్క్రాచ్‌ కార్డును వారికి ఇచ్చారు. దీంతో ఆమె వారికి ఓ స్క్రాచ్‌కార్డు వాళ్లకు ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో వారు షాక్ అయ్యారు.



ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. దీంతో ఏమొస్తుంది? నా మొహం గీకుడు తప్ప అంటూ చులకనగా చూశారు. డబ్బులు లేకపోతే మాత్రం ఈ కార్డు మామొహాన కొట్టి పోతుందా అనుకుంటూ తిట్టుకున్నారు.

వారిలో ఒకరు ఎందుకు వృథాగా దాన్ని పారేయటం చూద్దాంలే అంటూ ఆ కార్డుని స్క్రాచ్ చేయగా..50,000 యూరోలు (ఇండియా కరెన్సీలో రూ.43 లక్షలకు పైనే) గెలుచుకున్నారు. దీంతో వారు ఆనందం పట్టలేక గంతులేశారు. ‘‘స్క్రాచ్ కార్డు వేసిన ఆమెను అనవసరంగా తిట్టుకున్నామే అంటూ సారి అమ్మా..నీ రూపంలో మమ్మల్ని అదృష్టం వరించింది..మా దరిద్రం తీరిపోయిందంటూ’’ ఆమెను దీవించారు.


‘లాటరీ షాప్‌ వద్ద వీరు యాచిస్తుండగా ఓ యువతి ఒక యూరో వెచ్చించి కొనుగోలు చేసిన స్క్రాచ్‌ కార్డును వారికి ఇచ్చారు. దీంతో ఆమె వారికి ఓ స్క్రాచ్‌కార్డు వాళ్లకు ఇచ్చి వెళ్లిపోయింది. ఆ కార్డుకు 50,000 యూరోలు గెలుచుకున్నారనీ వారంతా ఫుల్ ఖుషీ అయిపోయారని ఫ్రెంచ్‌ లాటరీ ఆపరేటర్‌ ఎఫ్‌డీజే ఓ ప్రకటనలో తెలిపింది. ఆ డబ్బుల్ని ఆ నలుగురు సమానంగా పంచుకుంటామని తెలిపారని అన్నారు.



అదృష్టవంతుల్ని చెడగొట్టేవారు..దురదృష్టవంతుల్ని బాగుచేసేవారు ఎవ్వరూ ఉండరంట..అనే సామెత ఈ బిచ్చగాళ్ల విషయంలో ఎంత నిజమైందో కదా…