ఈ మూన్‌వాక్ కి మనమే ఆదర్శం: ప్రపంచం పొగుడుతుంది.. మెక్సికన్లు ఫాలో అయ్యారు

  • Edited By: vamsi , September 12, 2019 / 10:29 AM IST
ఈ మూన్‌వాక్ కి మనమే ఆదర్శం: ప్రపంచం పొగుడుతుంది.. మెక్సికన్లు ఫాలో అయ్యారు

బెంగళూరు రోడ్ల పరిస్థితిని వివరిస్తూ.. రోడ్డుపై ఆస్ట్రోనాట్ మూన్‌వాక్ చేసి వీడియో వైరల్ అవగా.. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచావ్యాప్తంగా వైరల్ అయ్యింది. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా పడుతున్న అవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేందుకు నంజుండస్వామి అనే బెంగళూరుకు చెందిన వ్యక్తి ఈ మేరకు వ్యోమగామి వేషం వేసి వీడియోని తీశారు.

ఈ వీడియో ప్రపంచం మొత్తం వైరల్ అవగా అనేక దేశాల ప్రజలు నంజుండస్వామి ఆలోచనను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే మెక్సికోకు చెందిన బొవిదా సెలెస్టే అనే అడ్వటైజింగ్ కంపెనీ కూడా ఈ ఐడియాతో ఓ వీడియో చేసింది.

తమ రోడ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేందుకు ఇదే కరెక్ట్ మార్గం అని భావించింది. వెంటనే ఫేస్‌బుక్ ద్వారా నంజుండస్వామిని సంప్రదించి ఐడియా వినియోగించేందుకు అనుమతి కావాలని కోరింది. నంజుండస్వామి ఇందుకు అంగీకరించడంతో ఈ ఐడీయాను మెక్సికోలో రోడ్లపై అప్లై చేసింది.

మెక్సికో దేశంలోని హిందాల్గో రాష్ట్ర రాజధానిలో వీడియోను షూట్ చేసింది. వీడియోలో ఓ చిన్న మార్పు చేసి వీడియోని అలాగే రూపొందించింది. వ్యక్తి తన చెతిలో మెక్సికో జాతీయ జండాను పట్టుకుని మూన్ వాక్ చేసినట్లు రోడ్డు మీద చేశాడు.