అమెరికా ఎన్నికలు : బెర్నీ సాండర్స్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు జరుగుతోంది

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 02:29 PM IST
అమెరికా ఎన్నికలు : బెర్నీ సాండర్స్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు  జరుగుతోంది

Bernie Sanders Predicted Trump’s Every Election Move అమెరికా అధ్యక్ష పీఠాన్నికైవసం చేసుకునే దిశగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను చూస్తే…. అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్​ ఓట్లకు గాను.. బైడెన్​ 264 ఓట్లు సాధించారు. ఇక,రిపబ్లిక్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేైసిన డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్​ ఓట్లు సాధించారు. అయితే,ఈ ఎన్నికల్లో జో బైడెన్ దే విజయం అని సృష్టంగా అర్థమవుతోంది.



అయితే, రెండు వారాల క్రితం అమెరికా ఎన్నికలకు సంబంధించి టాప్ డెమోక్రటిక్ సెనెటర్ బెర్నీ సాండర్స్(79) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిన్న, ఈ రోజు జరగిన సంఘటనలను ఓ సారి చూస్తే.. బెర్నీ సాండర్స్ మాట్లాడిన మాట అక్షరం పొల్లు పోలేదనడంలో ఎలాంటి సందేహం లేదు.



గత నెలలో టునైట్‌ షోలో భాగంగా జిమ్మీ ఫాలన్..బెర్నీ సాండర్స్ ని ఇంటర్వ్యూ చేశారు. అమెరికా ఎన్నికల గురించి.. కౌంటింగ్‌ సమయంలో చోటు చేసుకునే ట్విస్ట్‌లు.. ట్రంప్‌ స్పందన గురించి తన బెర్నీ సాండర్స్ తన అంచనాలను ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని.. ఫలితంగా కౌంటింగ్‌ ప్రక్రియ ముగియడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు.



https://10tv.in/i-am-not-afraid-of-resigning-punjab-cm-amarinder-slams-cenntre-moves-resolution-against-farm-laws/
బెర్నీ సాండర్స్ మాట్లాడుతూ.. పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌ వంటి రాష్ట్రాల్లో భారీ మొత్తంలో మెయిల్-ఇన్ బ్యాలెట్లు నమోదవుతాయి. ఫ్లోరిడా, వెర్మోంట్ లాంటి రాష్ట్రాల మాదిరిగా కాకుండా, వేరే ఇతర కారణాల వల్ల ఎన్నికల రోజు వెంటనే ఆ బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించలేరు. ఈ ఏడాది ఎక్కువ రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లు ఉండబోతున్నాయి. అయితే డెమొక్రాట్లు ఎక్కువగా మెయిల్‌- ఇన్‌ బ్యాలెట్స్‌ని వినియోగించుకుంటారు. రిపబ్లికన్లు మాత్రం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారు. ఇక ఎన్నికలు జరిగే నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్రంప్‌ పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో విజయం సాధిస్తాడు. దాంతో వెంటనే ట్రంప్ టీవీల్లో కనిపించి …నన్ను మరో సారి ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు… ఇక అంతా ముగిసింది… ఇదొక మంచి రోజు అంటారు అని బెర్నీ సాండర్స్ తెలిపారు.



అదేవిధంగా, మరుసటి రోజు మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు జరుగుతుంది. కీలక రాష్టాల్లో బైడెన్‌ విజయం సాధిస్తారు. అప్పుడు ట్రంప్‌… చూశారా మోసం చేశారు… మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ అంతా మోసం… నేను పదవికి రాజీనామా చేయను అంటారు అని బెర్నీ అంచనా వేశారు. ఇప్పుడు వాస్తవంలో కూడా అదే జరిగింది.

అమెరికాలో నిన్న జరిగిన,ఇవాళ జరగుతున్న రాజకీయ పరిణామాలు బెర్నీ సాండర్స్ అంచనా వేసినట్లుగానే ఉన్నాయి. హన్నాహ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేసిన బెర్నీ సాండర్స్ ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో 27 మిలియన్ల మంది ఈ వీడియో చూశారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బెర్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నారు.