క్వారంటైన్‌లో మధ్యాహ్నం భోజనం తర్వాత స్నానం చేయటానికి మంచి సమయం  

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 12:59 PM IST
క్వారంటైన్‌లో మధ్యాహ్నం భోజనం తర్వాత స్నానం చేయటానికి మంచి సమయం  

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ తో ఇంట్లో ఉండి టైమ్ పాస్ చేయటం చాలా కష్టంగా మారుతుంది. రోజు లాగానే నిద్రలేవడం, పళ్ళు తోముకోవడం, ఏదో పని చేయటంతో మనకు తెలియకుండానే సమయం గడిచిపోతుంది. మళ్ళీ ఇంతలోనే నిద్రపోయే సమయం అవుతుంది. రోజువారీ మన షెడ్యూల్ లోని పనులు కాకుండా, ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తు రోజును గడిపేస్తున్నారు. క్వారంటైన్ సమయంలో ఇంట్లో ఉండి మధ్యాహ్నం భోజనం తర్వాత స్నానం చేయటం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల మంచి యాక్టివ్ గా కనిపిస్తారు. ఇదేమి కొత్త ఆలోచన కాదు అని అంటున్నారు నిపుణులు.
  
కోవిడ్  లాక్ డౌన్ కి ముందు రోజూ ఉదయాన్నే స్నానం చేసే వాళ్ళం. ఎందుకంటే రాత్రి తలస్నానం చేస్తే ఉదయం కల్లా జుట్లు చిందరవందరగా తయారవుతుంది. మళ్ళీ ఆఫీస్‌కి వెళ్లే సమయంలో ఆ జుట్టుతో తిప్పలు పడాల్సి వచ్చేది. కానీ ఈ క్వారంటైన్ టైమ్ తో వర్క ఫ్రమ్ హోం చేస్తున్న వాళ్ళకి మధ్యాహ్నం భోజనం తర్వాత స్నానం చేయటం అనేది ఒక మంచి అవకాశం లభించింది. అలా ఉదయం నుంచి పని చేస్తూ ఉండి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్నానం చేయటంతో కొంత యాక్టివ్‌గా కనిపిస్తారు. మళ్ళీ ఫ్రెష్‌గా కొత్త ఉత్సాహంతో పని చేయటానికి ఉపయోగపడుతుంది.

ఒక వేళ మధ్యాహ్నం సమయంలో ఆఫీస్ మీటింగ్స్ జరిగినా, ఆ సమయంలో స్నానం చేసి ఉండటం వల్ల యాక్టివ్ గా కనిపిస్తారు. మనలో ఏదో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అంతేకాకుండా చల్లటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల ఎంతో రిలాక్స్ గా ఉంటాం. ఈ విధంగా ‘afternoon shower’తో  మీ రోజుని మరింత కొత్తగా మార్చుకోండి. మీ ఆఫీసు మీటింగ్‌లో మరింత యాక్టివ్‌గా, కొత్త ఉత్సాహంతో కనిపించండి.