#Christmas: బెత్లేహేములో క్రిస్మస్ పండుగ సంబరాలు

#Christmas: బెత్లేహేములో క్రిస్మస్ పండుగ సంబరాలు

Bethlehem Christmas Eve : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పాలస్తీనా నగరమైన బెత్లేహేము క్రిస్మస్ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకుంటోంది. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉండటంతో ఈ ఏడాది తక్కువ సంఖ్యలోనే సాంప్రదాయ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే ఏడాది క్రితమే యేసు జన్మస్థలంగా గుర్తింపు పొందిన బెత్లెహేమ్‌ సిటీలో రెండు దశాబ్దాలుగా క్రిస్మస్ పండుగ వేడుకలను జరుపుకుంటోంది. ఎక్కడా లేని విధంగా ప్రార్థనల హాజరయ్యే వారితో అత్యంత రద్దీగా కనిపిస్తుంది.

గతంలో కంటే ఈ ప్రాంతంలో హింసాకాండ తగ్గిపోవడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ, కరోనా సంక్షోభం కారణంగా ఇక్కడి అన్ని హోటళ్లు 2019 నుంచే మూతపడ్డాయి. అన్ని ఉత్సవాలను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించడం జరుగుతోంది. కానీ, ఈ ఏడాదిలో క్రిస్మస్ వేడుకల కోసం వచ్చే వారికి ప్రార్థనలకు అవకాశం కల్పించాలని అక్కడి బెత్లేహేము నేతలు భావిస్తున్నారు. క్రిస్మస్ వేడుకలకు పెట్టింది పేరు అయిన బెత్లెహేం వైపే ప్రపంచమంతా చూస్తోందని అంటున్నారు. సోషల్ నెట్ వర్కింగ్‌పై ఆంక్షలు ఉండటంతో ప్రజలంతా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలనే ఆశను మరింత పెంచుతోందని మేయర్ అంటోన్ సల్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

అందుకే సెలవుదినాన్ని అన్ని విధాలుగా జరుపుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. బెత్లేహేములోని ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. జెరూసలేంకు కొత్తగా నియమితులైన లాటిన్ పాట్రియార్క్, పియర్‌బాటిస్టా పిజ్జబల్లా.. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. 85 ఏళ్ల పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ Nativity చర్చిలో యాన్యువల్ మిడ్ నైట్ మాస్ ఈవెంటు‌కు హాజరుకానున్నారని పాలస్తీనా అధికారి చెప్పారు.