Home » International » భారత్ బయోటెక్.. కొవాగ్జిన్‌తో అద్భుత ఫలితాలు
Updated On - 9:48 pm, Fri, 11 September 20
By
sreehariప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్ రేసులో అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కనుగొనే ప్రయోగాల్లో భారత్ బయోటిక్ మరో ముందుడగు వేసింది. భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ట్రయల్స్ దశగా కొనసాగుతోంది.
జంతువులపై కొవాగ్జిన్ ట్రయల్స్ మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. దీని ట్రయల్‌కు సంబంధించి భారత్ బయోటెక్ ట్విటర్ ద్వారా పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జంతువుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని పేర్కొంది. రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత వాటిలో ఏమైనా ప్రతికూల ప్రభావాలు కనిపించాయా లేదో పరీక్షించనున్నారు. అంతేకాదు.. జంతువుల్లో ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్లు గుర్తించామని పరిశోధన సంస్థ తెలిపింది.
వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా పనిచేసిందని పేర్కొంది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయింది.. ఇటీవలే నిమ్స్లో రెండోదశ ట్రయల్స్ కూడా భారత్ బయోటెక్ సంస్థ ప్రారంభించింది..
Vaccine Production : సీరం, భారత బయోటెక్‌కు కేంద్రం ఆర్థిక సాయం
COVID-19 vaccine capsule: కొవిడ్ వ్యాక్సిన్ ట్యాబ్లెట్లు రెడీ చేస్తున్న ఇండియన్ ఫార్మా కంపెనీ
బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపైనా కోవ్యాగ్జిన్ పని చేస్తుంది.. ఆధారం ఇదిగో
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సేఫ్
పురుషుల కంటే మహిళల్లో అత్యధికంగా కరోనా యాంటీబాడీస్
కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌పై కీలక ప్రకటన