Covaxin 3rd Trail Data : కోవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్ డేటా విడుదల.. డెల్టా వేరియంట్‌ను 65.2శాతం అడ్డుకోగలదు!

కోవాగ్జిన్ (Covaxin) టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్ (Covaxin 3rd Trail Data) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్ పై కూడా 65.2 శాతం సమర్థతను కోవాగ్జిన్ చూపిస్తోంది.

Covaxin 3rd Trail Data : కోవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్ డేటా విడుదల.. డెల్టా వేరియంట్‌ను 65.2శాతం అడ్డుకోగలదు!

Bharat Biotech Says Covaxin (1)

Covaxin 3rd Trail Data : భారతదేశంలో కోవిషీల్డ్ తర్వాత కోవాగ్జిన్ టీకానే ఎక్కువగా అందుబాటులో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ప్రభావంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. జ్వరం కూడా రావట్లలేదని అంటున్నారు. చాలా మంది ఈ టీకా తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కోవాగ్జిన్ (Covaxin) టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్ (Covaxin 3rd Trail Data) ఫలితాలు విడుదలయ్యాయి.

దేశవ్యాప్తంగా 25,800 మంది వాలంటీర్లపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ కోవాగ్జిన్ ట్రయల్ ఫలితాల ఆధారంగా పరిశీలిస్తే.. 77.8 శాతం సమర్థంగా పనిచేస్తుందని తేలింది. అదే తీవ్ర లక్షణాలున్న కేసుల్లో అయితే 93.4 శాతం సమర్థత ఉన్నట్టు రుజువైంది. అంతేకాదు.. ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్ పై కూడా 65.2 శాతం సమర్థతను కోవాగ్జిన్ చూపిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ (Bharat Biotech) కోవాగ్జిన్ థర్డ్ ట్రయల్ డేటా ఫలితాలను విడుదలచేసింది.

నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. మొత్తం 146 రోజులపాటూ వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. మొత్తం 25 భారత ఆస్పత్రుల్లో మూడో ట్రయల్స్ జరిగాయి. వ్యాక్సిన్ సామర్ధ్యంతో పాటు ఎంతవరకు సురక్షితం.. వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోందో పరిశీలించారు.


కోవాక్సిన్ తేలికపాటి, తీవ్రమైన COVID-19 కేసుల్లో 77.8శాతం వ్యాక్సిన్ సామర్థ్యాన్ని చూపించింది. తీవ్రమైన COVID-19 (SARS-CoV-2) కేసుల్లో 93.4శాతం మాత్రమే ఉందని భారత్ బయోటెక్ నిర్వహించిన 3 వ దశ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడైంది. కోవాక్సిన్‌తో టీకాలతో మునపటి వైరస్ కంటే.. ప్రస్తుతం విజృంభిస్తోన్న (B.1.617.2 Delta variant), B.1.351 (Beta) వేరియంట్‌లపై 65.2శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ట్రయల్ ఫలితాల్లో సమర్థత రేటును చూపించాయని యూఎస్ డ్రగ్ డెవలపర్ ఓకుజెన్ (Ocugen) ఒక ప్రకటనలో తెలిపారు.