tokyo olympics : అస్సాం ఆణిముత్యం లవ్లీనా…దశాబ్దం తర్వాత భారత్ కు ‘కంచు’ పంచ్

లవ్లీనా బొర్గొహెయిన్. అస్సాం రాష్ట్రానికే కాదు భారత్ కు కూడా వన్నెతెచ్చిన బాక్సింక్ క్రీడాకారిణిగా టోక్యో ఒలింపిక్స్ ‘కంచు’పంచ్ తో భారత్ మూడో బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సింగ్ లో సత్తా చూపి కాంస్య పతకాన్ని కౌవసం చేసుకున్నారు అస్సాం ఆణిముత్యం లవ్లీనా. మాగ్నిఫిసెంట్ మేరీ తరువాత పతకాన్ని ముద్దాడుతున్న రెండో మహిళగా కీర్తి గడించారు.

10TV Telugu News

Bharath Boxer lovlina settles for bronze in tokyo olympics : లవ్లీనా బొర్గొహెయిన్. అస్సాం రాష్ట్రానికే కాదు భారత్ కు కూడా వన్నెతెచ్చిన బాక్సింక్ క్రీడాకారిణిగా టోక్యో ఒలింపిక్స్ ‘కంచు’పంచ్ తో భారత్ మూడో బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సింగ్ లో సత్తా చూపి కాంస్య పతకాన్ని కౌవసం చేసుకున్నారు అస్సాం ఆణిముత్యం లవ్లీనా. మాగ్నిఫిసెంట్ మేరీ తరువాత పతకాన్ని ముద్దాడుతున్న రెండో మహిళగా కీర్తి గడించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఆమె దక్కించుకున్నది కాంస్య పతకమే కావచ్చు. కానీ అది స్వర్ణ పతకానికంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత బాక్సింగ్ కు దాదాపు దశాబ్ధం తరువాత ఒలింపిక్స్ పతకాన్ని భారత్ కు అందించిన ఘనత మాత్రం లవ్లీనాకే దక్కింది. అంతేకాదు లవ్లీనా అరంగేట్రం మెగా ఆటల్లో పోడియంపై నిలబడిన బాక్సర్ గా భారత్ కే వన్నె తెచ్చారు అస్సాం అరుదైన ఆణిముత్యం లవ్లీనా బొర్గొహెయిన్.

అంతర్జాతీయ బాక్సింగ్ లో పెద్దగా అనుభవం లేకపోయినా సెమీ ఫైనల్ వరకూ వెళ్లటం అంటే మాటలు కాదు. అస్సాం మట్టిలో పూసిన ఈ మణిపూస సెమీస్ పోరు ప్రత్యర్థికి గట్టిపోటీ ఇచ్చారు. పోరాడి ఓడిందీ అనేకంటే..సెమీ ఫైనల్ వరకూ వెళ్లి భారత పేరును నిలబెట్టిందనే చెప్పాల్సిందే. ఎందుకంటే సెమీ ఫైనల్ లో పోరు అంత ఈజీ కాదు మరి. పైగా ప్రత్యర్థి స్వర్ణాల రాణి.సెమీ ఫైనల్ లో టర్కీకి చెందిన ప్రత్యర్థి సుర్మెనెలి అప్పటికే అతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలిచి మంచి ఫామ్ లో ఉన్నారు. అటువంటి ప్రత్యర్థికి కూడా మన లవ్లీనా గట్టి పోటీ ఇవ్వటం అంటే మాటలు కాదనే విషయం గుర్తించాలి.అందుకే ఆమె గెలిచింది కాంస్యమే అయినా అది స్వర్ణ పతకంతో సమానమని చెప్పి తీరాల్సిందే.

సుర్మెలి విజయాలు..
టర్కీ క్రీడాకారిణి సుర్మెనెలి గతంలో మిడిల్ వెయిట్ అంటే 75 కిలోల విభాగంలో ఆడారు. దాంట్లో ఆమె ఒకేసారి 69 కిలోల విభాగంలో తలపడ్డారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో 16 కొల్లగొట్టిన ఘన చరిత్ర సుర్మెనెలిది. అటువంటి ప్త్రత్యర్థితో సెమీపోరులో తలపడటమంటే మాటలు కాదు. పిడిగుద్దులు, హుక్స్, బాడీ షాట్స్ లకు సుర్మెనెలి స్పెషలిస్టు. ఆమె పిడిగుద్దులు, హుక్స్, బాడీ షాట్స్ తో విరుచుకుపడే సుర్మెనెలితో తలపడి స్ఫూర్తి కలిగించేలా పోరాడారు లవ్లీనా.

స్ఫూర్తినిచ్చిన లవ్లీనా..
పిడిగుద్దులు కురిపించే సుర్మెనెలితో సెమీస్ లో తలపడిన లవ్లీనా 0-5 తేడాతో ఓటమి చవిచూసినా ఏమాత్రం తగ్గలేదు. పోరాటమే ఊపిరగా పోరాటాన్నొ కడవరకూ కొనసాగించారు.మూడు రౌండుల్లో సుర్మెనెలి తన పంచ్ లతో న్యాయ నిర్ణేతలను కూడా ఆకట్టుకుంది. ఏమి షాట్స్ భయ్యా అనేలా తలపడింది. అటువంటి పంచ్ లను కూడా లవ్లీనా తన తొలి రౌండ్ లోనే డిఫెన్స్ తో అడ్డుకుంది. ఈ క్రమంలో సుర్మెనెలి 50-45తో మొదటి రౌండ్ లో విజయం సాధించారు.రెండో రౌండ్లో లవ్లీనా ఓ స్థాయిలో రెచ్చిపోయారనే చెప్పాలి.తనను తాను డిఫెన్స్ చేసుకుంటూనే ప్రత్యర్థికి పంచులు విసిరింది. కానీ ఆఖరి రౌండ్లో బలహీనపడిపోయారు లవ్లీనా.

ఈక్రమంలో 30-26,30-26,30-25,20-25,30-25 తో టర్కీ క్రీడాకారిణి స్వర్ణాల రాణి సుర్మెనెలి విజయం సాధించారు.2008లో విజేందర్, 2012లో మణిపూర్ మణిపూస మేరీకోమ్ తరువాత 2021లో అస్సాం క్రీడాకారిణి లవ్లీనా బొర్గొహెయిన్ భారత్ కు పతకాన్ని అందించటం గమనించాల్సిన విషయం.

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బారో ముఖియా గ్రామంలో 1997 అక్టోబర్ 2 జన్మించారు లవ్లీనా బొర్గొహెయిన్. తండ్రి చిరు వ్యాపారి. ఆమెకు ఇద్దరు అక్కలు కవలలు. వీరిద్దరు కిక్ బాక్సింగ్ లో జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.అక్కలను చూసి స్ఫూర్తి పొందిన లవ్లీనా కూడా బాక్సింగ్ లో అడుగుపెట్టారు. జిల్లా స్థాయిలో పోటీ పడుతూనే ఓరోజు స్పోర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమె చదువుతున్న హైస్కూల్లో పోటీల్లో పాల్గొన్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ కోచ్ పదుమ్ బోరో ఆమెను కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్ కు పరిచయంచేశారు.అలా 2012 నుంచి బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటం ప్రారంభించి ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించారు.

2017లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలుచుకోవటంతో లవ్లీనా పేరు బాక్సింగ్ ప్రపంచానికి తెలిసింది.ఆ తరువాత ఆమె వెనుతిరిగి చూడలేదు. 2018లో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అదే సంవత్సరం ఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ పోటీల్లో ఎంట్రీ ఇచ్చి..69కేజీల విభాగంగా కాంస్య పతకం సాధించి..అందరినీ ఆశ్చర్యానికి గురించేసింది. ఆ తరువాత రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ లో మరో కాంస్యం సాధించారు లవ్లీనా. అంతేకాకుండా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో రెండు కాంస్యాలు గెలిచిన చరిత్ర లవ్లీనాది.

10TV Telugu News