కొవిడ్ వ్యాక్సిన్ బహిరంగ ప్రచారంలో ఒబామా, బుష్, బిల్ క్లింటన్

కొవిడ్ వ్యాక్సిన్ బహిరంగ ప్రచారంలో ఒబామా, బుష్, బిల్ క్లింటన్

covid vaccine:అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ లతో పాటు ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ కలిసి కరోనా వ్యాక్సిన్ ప్రచారంలో పాల్గొన్నారు. వాడకంలో పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యేలా ఈ ప్రచారాన్ని చేపట్టారు. అక్కడి మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒబామా.. టాప్ యూఎస్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్‌పర్ట్ ఆంటోనీ ఫాసీ కొవిడ్ వ్యాక్సిన్ ను గుర్తిస్తే తాను కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి రెడీగా ఉన్నానని ఒబామా అన్నారు.

ఆంటోనీ ఫాసీ వ్యాక్సిన్ సేఫ్ అని చెప్తే తాను కూడా టీకా వేయించుకుంటానని కొవిడ్ నుంచి ఇమ్యూనిటీ పొందుతానని చెప్పారు. ప్రమాదం తక్కువగా ఉండి ప్రజల కోసమే తయారుచేసిన ఈ వ్యాక్సిన్ ను తాను తీసుకునేందుకు రెడీగా ఉన్నానని అన్నారు. దీని గురించి నేను ప్రచారంలో పాల్గొంటే ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అనుకుంటున్నా అని ఒబామా అన్నారు.



బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కలిగించడం చాలా ముఖ్యం. ఏది చేయగలరో ఆ మోడల్ ను రెడీ చేసుకోవాలి. వ్యాక్సిన్స్ ను ఫైజర్ బయోఎన్ టెక్, మోడర్నా ఎన్ఐహెచ్ లు డెవలప్ చేసి యూఎస్ అథారిటీలు అప్రూవ్ చేస్తాయని ఎదురుచూస్తున్నాయి.

ఫిబ్రవరి చివరి నాటికి 100మిలియన్ మంది వరకూ ఈ వ్యాక్సిన్ తో ఇమ్యూనిటీ పొందుతారని ఆశిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.