Joe Biden: స్వలింగ వివాహాలకు బైడెన్ ఆమోదముద్ర.. అమెరికాలో అమల్లోకి రానున్న కొత్త చట్టం

అమెరికా సరికొత్త చరిత్రకు నాంది పలికింది. దేశంలో స్వలింగ వివాహాలను అంగీకరిస్తూ రూపొందించిన చట్టానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. ఈ చట్టం ఇక నుంచి అమల్లోకి వస్తుంది.

Joe Biden: స్వలింగ వివాహాలకు బైడెన్ ఆమోదముద్ర.. అమెరికాలో అమల్లోకి రానున్న కొత్త చట్టం

Joe Biden: అమెరికాలో వివాహాలకు సంబంధించి సరికొత్త చట్టం అమల్లోకి రానుంది. స్వలింగ వివాహాల్ని అంగీకరిస్తూ రూపొందించిన కొత్త చట్టానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని అంగీకరిస్తూ అధికారికంగా బుధవారం సంతకం చేసినట్లు జో బైడెన్ వెల్లడించారు.

Uttar Pradesh: తండ్రితో కలిసి భార్యను చంపిన డాక్టర్.. 400 కిలోమీటర్ల దూరంలో రహస్యంగా అంత్యక్రియలు

సోషల్ మీడియా వేదికగా ఈ చట్టం అమల్లోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో లింగ వివక్షకు తావు లేకుండా, అందరూ ఒక్కటే అని చెప్పేందుకు ఈ చట్టం ద్వారా ముందడుగు వేశాం. న్యాయం, సమానత్వం అందరికీ అందుతాయి. ఈ కొత్త చట్టం, ప్రేమ.. ఇంతవరకు ఉన్న ద్వేషాన్ని చెరిపేస్తాయి. ఇది ప్రతి ఒక్క అమెరికన్‌కు సంబంధించింది’’ అని బైడెన్ పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఇప్పటివరకు అమెరికాలో అమల్లో ఉన్న ‘డిఫెన్స్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్’ చట్టం రద్దవుతుంది. ఇది స్త్రీలు, పురుషులు మాత్రమే వివాహం చేసుకోవాలని చెప్పేది. దీని స్థానంలో ఇకపై ‘రెస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్’ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం లింగ బేధం లేకుండా ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు.

Lionel Messi: ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న మెస్సీ… ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో వీడ్కోలు చెప్పనున్న అర్జెంటినా దిగ్గజం

స్త్రీలు-స్త్రీలు, పురుషులు-పురుషులు కూడా వివాహం చేసుకోవచ్చు. ఈ చట్టాన్ని అమల్లోకి తేవడంపై పలువురు సెలబ్రిటీలు, ఎల్జీబీటీ కమ్యూనిటీ పీపుల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఈ తరహా చట్టాల్ని వ్యతిరేకించారు. అయితే, బైడెన్ మాత్రం ఎల్జీబీటీ కమ్యూనిటీని ప్రోత్సహిస్తున్నారు. ‘గే’ వ్యక్తికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు.