Joe Biden: చైనా దాడి చేస్తే తైవాన్‌కు అండగా ఉంటాం.. స్పష్టం చేసిన జో బైడెన్

తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే, అమెరికా దళాలు తైవాన్‌కు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొంతకాలంగా తైవాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Joe Biden: చైనా దాడి చేస్తే తైవాన్‌కు అండగా ఉంటాం.. స్పష్టం చేసిన జో బైడెన్

Joe Biden: తైవాన్‌పై చైనా సైనిక దాడికి దిగితే, ఆ దేశానికి అమెరికా సైన్యం అండగా ఉంటుందని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఒక మీడియా సంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్ ఈ విషయంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

తైవాన్‌పై చైనా సైనిక దాడికి దిగితే అమెరికా దళాలు తైవాన్‌కు మద్దతుగా నిలుస్తాయని బైడెన్ చెప్పారు. గతంలో కూడా తైవాన్-చైనా వివాదంలో అమెరికా జోక్యం చేసుకుంటుందని బైడెన్ చెప్పారు. కాగా, తాజాగా బైడెన్ చేసిన ప్రకటనను తైవాన్ స్వాగతించింది. బైడెన్ వ్యాఖ్యలు.. తైవాన్‌కు అవసరమైన భద్రతా సాయం అందించేందుకు అమెరికా కట్టుబడి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తైవాన్ వ్యాఖ్యానించింది. అమెరికాతో తమ రక్షణ పరమైన, భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని తైవాన్ వెల్లడించింది. మరోవైపు తైవాన్ స్వాతంత్ర్య కాంక్షను ప్రోత్సహించబోమని కూడా బైడెన్ చెప్పారు. ఈ విషయం తైవాన్‌కే వదిలేశారు. బైడెన్ వ్యాఖ్యల అనంతరం అమెరికాకు చెందిన వైట్ హౌజ్ అధికారిక ప్రకటన విబుదల చేసింది.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

‘‘వన్ చైనా పాలసీలో ఎలాంటి మార్పులూ లేవు. ఈ విషయాన్ని బైడెన్ గతంలో కూడా చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో టోక్యోలో కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. దీంతోపాటు తైవాన్ పాలసీలో కూడా ఎలాంటి మార్పులూ లేవు. ఇది నిజం’’ అని వైట్ హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. స్వతంత్ర్య దేశంగా ఉన్న తైవాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తైవాన్‌పై సైనిక చర్యకు కూడా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో నిజంగానే తైవాన్‌పై చైనా దాడికి దిగితే… అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.