Russia-Ukraine war: రష్యా అణ్వాయుధాలు వాడితే..: అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరిక

‘ఒకవేళ అణ్వస్త్రాలను వాడితే అది రష్యా చేసిన అతి పెద్ద పొరపాటే అవుతుంది’’ అని బైడెన్ చెప్పారు. రష్యా థర్టీ బాంబ్ లేదా అణ్వస్త్రాన్ని మోహరించేందుకు సిద్ధమవుతుందా? అన్న ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. దీనిపై తాను ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేనని అన్నారు. అయితే, రష్యా అణ్వాయుధాలను వాడితే మాత్రం పెద్ద పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియెర్ స్పందిస్తూ.. ఈ అంశంపై బైడెన్ పూర్తి స్పష్టతతో ఉన్నారని చెప్పారు.

Russia-Ukraine war: రష్యా అణ్వాయుధాలు వాడితే..: అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరిక

Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా చేస్తోన్న దాడులను దీటుగా ఎదుర్కొంటూ ఆ దేశాన్ని ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో రష్యా అణ్వస్త్రాలను వాడేందుకు సిద్ధమవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ రష్యాను హెచ్చరించారు.

‘‘ఒకవేళ అణ్వస్త్రాలను వాడితే అది రష్యా చేసిన అతి పెద్ద పొరపాటే అవుతుంది’’ అని బైడెన్ చెప్పారు. రష్యా థర్టీ బాంబ్ లేదా అణ్వస్త్రాన్ని మోహరించేందుకు సిద్ధమవుతుందా? అన్న ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. దీనిపై తాను ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేనని అన్నారు. అయితే, రష్యా అణ్వాయుధాలను వాడితే మాత్రం పెద్ద పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియెర్ స్పందిస్తూ.. ఈ అంశంపై బైడెన్ పూర్తి స్పష్టతతో ఉన్నారని చెప్పారు.

రష్యా అణ్వాయుధాలను వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అన్నారు. ‘థర్టీ బాంబ్’ అంటూ ఉక్రెయిన్ విషయంలో రష్యా పలు తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ అంశాన్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, రష్యా అణ్వాయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా చెప్పింది. రష్యా రహస్యంగా పలు చర్యలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ కూడా తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..