Biden: హద్దు మీరితే ధీటుగా బదులిస్తాం.. ఇది క్లియర్ – బైడెన్

ప్రెసిడెంట్ జో బైడెన్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. బ్రిటిష్ ఎయిర్ బేస్ లోని వెయ్యి ట్రూపులు, వారి కుటుంబాలకు ప్రత్యేక సందేశం ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే వారం NATO, G7 యూరోపియన్ లీడర్లను కలిసిన తర్వాత ...

Biden: హద్దు మీరితే ధీటుగా బదులిస్తాం.. ఇది క్లియర్ – బైడెన్

Biden

Biden: ప్రెసిడెంట్ జో బైడెన్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. బ్రిటిష్ ఎయిర్ బేస్ లోని వెయ్యి ట్రూపులు, వారి కుటుంబాలకు ప్రత్యేక సందేశం ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే వారం NATO, G7 యూరోపియన్ లీడర్లను కలిసిన తర్వాత వెల్లడిస్తానని చెప్పారు.

‘మేం రష్యాతో ఎటువంటి విబేధాలు పెట్టుకోదలచుకోలేదు. స్థిరమైన, ఊహించదగ్గ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఇది క్లియర్. అలా కాదని హద్దు మీరి హానికారక చర్యలకు పాల్పడితే అంతే ధీటుగా బదులిస్తాం.

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్‌గా ఇది నా తొలి విదేశీ పర్యటన. G7, NATO సదస్సులకు హాజరుకావాల్సి ఉంది. పుతిన్ ను కూడా కలవాలనుకుంటున్నా అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మేం క్లియర్ గా ఉన్నాం. ప్రపంచంలోని ప్రజాస్వామ్యాలన్ని ఒకవైపు ఉన్నాయి. క్లిష్టమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాయి’ అని చెప్పారు.

బ్రిట‌న్ చేరుకున్న బైడెన్‌.. ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను క‌ల‌వ‌డంతో పాటు యూరోప్ దేశాల్లో మొత్తం 8 రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. విండ‌ర్స్ క్యాసిల్‌లో క్వీన్ ఎలిజ‌బెత్‌ను క‌ల‌వ‌నున్నారు.

ర‌ష్యాకు సంబంధించిన ఆయుధ నియంత్ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పులు, ఉక్రెయిన్‌లో ర‌ష్యా జోక్యం, సైబ‌ర్ హ్యాకింగ్‌, న‌వాల్ జైలు శిక్ష లాంటి అంశాల‌పై బైడెన్ ఒత్తిడి తెచ్చే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.