సెక్యూరిటీ అధికారిపై దాడి.. వైట్ హౌస్ వీడిన బైడెన్ పెంపుడు కుక్కలు

సెక్యూరిటీ అధికారిని గాయపర్చిన తన పెంపుడు కుక్కును వైట్ హౌస్ నుంచి పంపించేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. దానితో పాటు మరో పెంపుడు కుక్కని కూడా డెలావేర్ లోని తమ సొంత ఇంటి వద్దకు తిరిగి పంపారని సమాచారం.

సెక్యూరిటీ అధికారిపై దాడి.. వైట్ హౌస్ వీడిన బైడెన్ పెంపుడు కుక్కలు

Biden’s Dogs సెక్యూరిటీ అధికారిని గాయపర్చిన తన పెంపుడు కుక్కును వైట్ హౌస్ నుంచి పంపించేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. దానితో పాటు మరో పెంపుడు కుక్కని కూడా డెలావేర్ లోని తమ సొంత ఇంటి వద్దకు తిరిగి పంపారని సమాచారం.

బైడెన్ దంపతులకు పెంపుడు జంతువులంటే అమితమైన ఇష్టం. వారు ఛాంప్, మేజర్ అనే శునకాలను పెంచుకుంటున్నారు. ఈ రెండూ జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవి. ఛాంప్ ను 2008 నుంచి పెంచుకుంటున్నారు. మేజర్ 2018లో వచ్చిచేరింది. మేజర్ వయస్సు మూడేళ్లు. 2018లో డెలావెర్ లోని ఓ రెస్క్యూ హోం నుంచి బైడెన్ దంపతులు “మేజర్”ని దత్తత తీసుకున్నారు. తమ కుమార్తె ఇష్టపడడంతో ఈ శునకాన్ని పెంచుకుంటున్నారు. చాలా త్వరగా దీనిపై ప్రేమను పెంచుకున్నారు. ముఖ్యంగా బైడెన్ దీన్ని అమితమైన ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు.

అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి రెండు రోజుల ముందు వారి రెండు పెంపుడు శునకాలు వైట్ హౌస్ కి చేరుకున్నాయి. ఈ శునకాలు వైట్ హౌస్ లోని ఎలివేటర్ లోకి వెళ్లడం,ఎక్కువమంది ఉండే దక్షిణంవైపు లాన్ లోకి వెళ్లడం చేస్తుండటంతో బైడెన్ సతీమణి వీటిని అదుపు చేసే బాధ్యత తీసుకున్నారు. వాస్తవానికి శ్వేతసౌధంలోని పర్నీచర్ పైకి శునకాలను రానీయరు. కానీ వైట్ హౌస్ లోని సోఫాలపై ఎక్కువసేపు ఈ కుక్కలు పరుగులు తీస్తుంటాయి.

అయితే, చిన్నవైన మేజర్ వైట్ హౌస్ సిబ్బందితో దూకుడుగా ప్రవర్తించేదని సమాచారం. అధ్యక్ష భవనంలో నివసించిన మొట్టమొదటి రెస్క్యూ డాగ్ గా గుర్తింపు పొందిన మేజర్..గతవారం వైట్ హౌస్ లో ప‌నిచేస్తున్న ఓ సెక్యూరిటీ అధికారిపై దాడిచేసి గాయపర్చింది. మేజర్ దాడిలో గాయపడిన భద్రతా అధికారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ ఘటనతో మేజర్, ఛాంప్ రెండింటినీ బైడెన్ దంపతులు.. డెలావేర్ రాష్ట్రంలోని లో వెల్మింగ్టన్ లోని తమ సొంత ఇంటి వద్దకు తిరిగి పంపారని సమాచారం. కాగా, గ‌త ఏడాది దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన కొన్ని రోజుల‌కే శున‌కంతో ఆడుకుంటూ బైడెన్ త‌న కాలికి గాయం చేసుకున్న విష‌యం తెలిసిందే.