సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయానికి బ్రేక్.. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం సెలబ్రేషన్స్ క్యాన్సిల్

సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయానికి బ్రేక్.. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం సెలబ్రేషన్స్ క్యాన్సిల్

joe biden

Joe Biden: జో బైడెన్ ప్రమాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు క్యాన్సిల్ చేయాలని నిర్ణయించింది కాంగ్రెషనల్ కమిటీ. కొద్ది నెలల కిందట జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అదే సమయానికి కొత్తగా ప్రభావం చూపిస్తున్న కరోనా స్ట్రెయిన్, కరోనా వైరస్ ల ప్రభావం పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రమాణ స్వీకారాత్సోవాలకు జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ న్యూ హెల్త్, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తూ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. కానీ, మంగళవారం ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేయాలని బైడెన్ ప్లానర్స్ నిర్ణయించారు. ‘కార్యక్రమానికి విచ్చేసే గెస్ట్ లు, ముఖ్యుల హెల్త్, సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని ఇలా చేశాం’ అని కాంగ్రెషనల్ కమిటీ పైగె వాల్ట్జ్ ప్రతినిధి అంటున్నారు.

అయితే ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారోత్సవ సభను పెద్ద సంఖ్యలో వీక్షించడమనేది పరిపాటిగా వస్తుంది. అధికారులు చేతులు మారి కొత్త ప్రెసిడెంట్ కు అవకాశం దక్కుతుండటమనేది అమెరికా చరిత్రలో గొప్ప విషయం. ఈ సందర్భంగా వాళ్లు తీసుకునే లంచ్ కూడా గ్రేట్‌గా నిలిచింది.

ప్రెసిడెంట్ బరాక్ ఒబామా.. లింకన్ భోజనాన్ని ఫాలో అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం వర్జీనియా ఆంగూస్ బీఫ్, గల్ఫ్ ష్రింప్, మైనె లాబస్టర్ లతో ముగించాడు.

ఈ సంప్రదాయం మూలాలు 19వ శతాబ్ధం నుంచి మొదలైయ్యాయి. కాంగ్రెస్ కు ప్రతినిధిగా ఎన్నికైన ప్రెసిడెంట్ డ్వైట్ ఈసెన్‌హవర్ 1952లో చేసిన ప్రమాణ స్వీకారం నుంచి ఇది కామ్ అయింది. ఆ తర్వాత జిమ్మీ కార్టర్ మినహాయించి అంతా ప్రమాణ స్వీకారోత్సవంలో లంచ్ అయ్యాక వైట్ హౌజ్‌కు చేరుకున్నారు.

కాపిటల్ హిల్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కాంగ్రెషనల్ కమిటీ లేదా బైడెన్ టీం మాత్రమే ప్లాన్ చేయలేదు. కానీ, బైడెన్ టీం మాత్రం ఈ ఈవెంట్ కోసం వాషింగ్టన్‌కు రావొద్దని చెప్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ సభ్యులతో పాటు ఇతరులకు సైతం లిమిటెడ్ టిక్కెట్స్ మాత్రమే ఇవ్వనుంది కాంగ్రెస్.