బైడెన్ పిలుపు : కోవిడ్ మృతుల జ్ఞాపకంగా లైట్లు, చర్చి బెల్స్ మోగిస్తూ స్మరించుకుందాం!

బైడెన్ పిలుపు : కోవిడ్ మృతుల జ్ఞాపకంగా లైట్లు, చర్చి బెల్స్ మోగిస్తూ స్మరించుకుందాం!

Biden’s plan for Inauguration Eve: 2020 ఏడాదంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కరోనా విజృంభణతో లక్షలాది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. కరోనా పరిస్థితుల్లోనే అమెరికన్లు 2021లోకి అడుగుపెట్టేశారు. ఈ నేపథ్యంలో 2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఒక రోజు ముందుగానే అమెరికాలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిందరి జ్ఞాపకార్థంగా లైటింగ్ సెర్మనీకి  జో బైడెన్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 19న సాయంత్రం (5.30 గంటలకు) ఈ వేడుకను నిర్వహిస్తామని ప్రెసిడెన్షియల్ ప్రారంభ కమిటీ ప్రకటించింది.

జో బైడెన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ వేడుకలో అమెరికన్లు పాల్గొని లైట్లతో పాటు చర్చి గంటలను మోగిస్తూ స్మరించుకోవాలని పేర్కొంది. లింకన్ రిప్లెక్టింగ్ ఫూల్ చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతిఒక్కరిలో తమ భవనాల్లో లైట్లను వెలిగించడంతో పాటు చర్చి గంటలను మోగిస్తూ కోవిడ్ మృతులను గౌరవంగా స్మరించుకోవాలని బైడెన్ పిలుపునిచ్చారు.

మహమ్మారి కారణంగా చాలా మంది అమెరికన్లలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎన్నో ఫ్యామిలీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకోవాలని.. అదే వారికిచ్చే గౌరవమని జాతిని ఉద్దేశించి బైడెన్ పిలుపునిచ్చారు.