బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో ఒక్క రోజే 2 వేల మంది మృతి!

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 04:14 AM IST
బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో ఒక్క రోజే 2 వేల మంది మృతి!

అగ్రరాజ్యం ఇప్పుడు వణికిపోతోంది. ఎదో శత్రుదేశంతో కాదు..కరోనా రాకాసితో. వేలాది మంది చనిపోతున్నారు. ఒక్క రోజులోనే రెండు వేల మంది చనిపోతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. ఇప్పటి వరకు 18 వేల 856 మంది చనిపోయారని అంచనా. ఒకే రోజులో రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు సంభవించాయని జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షణాలకు చేరుకున్నట్లు అంచనా. 

ప్రస్తుతం ఆ దేశంలో మరణాల సంఖ్య 19వేలకు చేరువైంది. కేవలం 24 గంటల్లోనే 2043 మంది చనిపోయారు. దీంతో  ఇటలీ, స్పెయిన్‌ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. మరోవైపు… కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పాజిటివ్ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు. చనిపోతున్నవారిని  పూడ్చడానికి సమాధి స్థలాలు సరిపోవడం లేదు. 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ..అమెరికన్లు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అమెరికాలో సంభవించిన మరణాల్లో అత్యధికంగా న్యూయార్క్ లో సంభవించాయి. డెడ్ బాడీస్ తో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు కూడా. 

మరోవైపు ప్రజలను రక్షించుకొనేందుకు అమెరికా ప్రభుత్వం..పలు చర్యలు తీసుకొంటోంది. ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఇటలీలో అత్యధికంగా మరణించారు. అమెరికాలో కరోనా కల్లోలానికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారిపోయింది. ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా కొత్త కేసుల సంఖ్య తగ్గడంలేదు. మరణాల రేటు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది.

ఈ ఒక్క నగరంలోనే లక్షా 70వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా… ఇప్పటికే దాదాపు 8వేల మంది మృతి చెందారు. కేవలం 24 గంటల్లో 8 వందల మంది మృత్యువాత పడటం కలవర పెడుతోంది. మరోవైపు… మృతదేహాలను పూడ్చిపెట్టేందకు సమాధులు సరిపోకపోవడంతో సామూహిక ఖననం చేస్తున్నారు. వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిని హ‌ర్ట్ ఐలాండ్‌కు తీసుకెళ్లి ఖ‌న‌నం చేస్తున్నారు.  

Also Read | లాక్ డౌన్ వేళ బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే..బిర్యానీతో విందు