Texas : కోవిడ్ టెస్టు బిల్లు రూ. 40 లక్షలు!

అమెరికాలో కోవిడ్ టెస్టులకు వసూలు చేసే చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేదు. అయినా..అప్పుడప్పుడు కొన్ని సెంటర్లు భారీ బిల్స్ పేషెంట్లకు షాక్ కు గురి చేస్తున్నాయి.

Texas : కోవిడ్ టెస్టు బిల్లు రూ. 40 లక్షలు!

Covid Test

COVID Test In Texas : చూడగానే..మీకు ఎలా షాక్ తగిలిందో.. ఈ బిల్లు చూసిన వ్యక్తికి కూడా అలాగే తగిలింది. గుండె గుభేల్ మంది. కొన్ని క్లినిక్ లు భారీగా బిల్లులు వేస్తూ…నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో వైరల్ గా మారుతున్నాయ. తాజాగా..ఓ వ్యక్తి కోవిడ్ టెస్టు చేయించుకోగా..సదరు సెంటర్ వాళ్లు వేసిన బిల్లు 54 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 40లక్షలు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

Read More : Tribe Dangerous feat : కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు

అమెరికాలో కోవిడ్ టెస్టులకు వసూలు చేసే చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేదు. అయినా..అప్పుడప్పుడు కొన్ని సెంటర్లు భారీ బిల్స్ పేషెంట్లకు షాక్ కు గురి చేస్తున్నాయి. ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి పీసీఆర్ టెస్టు, యాంటీజెన్ టెస్టులు చేయించుకున్నాడు. ఇతనికి మోలినా హెల్త్ కేర్ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్లకు బిల్లు పంపించారు. ఏకంగా 54 వేల డాలర్లు (రూ. 40లక్షలు)… బిల్లు చూసి హతాశులయ్యాడు. దీనికి సంబంధించిన విషయాన్ని Michael Mina అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

Read More : Arms License : ఆన్‌లైన్‌లో.. గన్‌ లైసెన్సులు

వార్నర్ భార్య కూడా అదే సెంటర్ లో టెస్టులు చేయించుకున్నట్లు అతడు వెల్లడించారు. ఆమెకు సెంటర్ వాళ్లు రూ. 2 వేల డాలర్లు వేశారు. ఈమెకు మరో ఇన్సూరెన్స్  సంస్థ నుంచి బీమా ఉంది. వాళ్లు ఈ బిల్లును వెయ్యి డాలర్లకు సెటిల్ చేశారు. ఎలాగొలా బతిమాలడగా..వార్నర్ బిల్లు 16 వేల 915 డాలర్లకు తగ్గించారంట. వార్నర్ విషయంలో సెంటర్ వాళ్లు బిల్లింగ్ లో కొన్ని పొరపాట్లు చేశారని తెలుస్తోంది. అయినా..కోవిడ్ టెస్టులకు ఇంత భారీ మొత్తంలో బిల్లులు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా..ఈ టెస్టుకు 8 నుంచి 15 డాలర్లు మాత్రమే అవుతుందని Michael Mina వెల్లడించారు.