Virgin Galactic : రిచర్డ్ రోదసి ట్రిప్..నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక

అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడింది.

Virgin Galactic : రిచర్డ్ రోదసి ట్రిప్..నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక

Sp

Virgin Galactic అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడింది. వర్జిన్ గెలాక్టిక్(అమెరికన్ స్పేస్ ఫ్లైట్ కంపెనీ)వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్‌సన్ బృందం రోదసి యాత్ర ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8గంటలకు.. తెలుగమ్మాయి బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ కి చెందిన వీఎస్‌ఎస్‌ యూనిటీ-22 వ్యోమనౌక రోదసీలోకి బయల్దేరింది. తొలిసారి అంతరిక్షంలోని మానవులను తీసుకెళ్లిన ప్రయోగంగా యూనిటీ-22 రికార్డు సృషించింది.

అయితే వాతావరణ మార్పుల కారణంగా నిర్దేశిత సమయానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా వ్యోమనౌక బయల్దేరింది. మొత్తం 90 నిమిషాల పాటు యాత్ర కొనసాగనుంది. ఇప్పటివరకు భారత్ నుంచి రాకేష్ శర్మ,కల్పనా చావ్లా,ఇండో అమెరికాన్ సునీతా విలియన్స్ రోదసీలోకి వెళ్లి వచ్చారు. తాజాగా నాలుగో వ్యక్తిగా బండ్ల శిరీష నిలిచారు.

వర్జిన్ గెలాక్టిక్ ప్రత్యేకంగా రూపొందించిన ప్లేన్ క్యారియర్ ద్వారా భూమి నుంచి స్పేస్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ని అంతరిక్షంలోకి వెళ్లింది. ఈ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లాక దాని నుంచి స్పేస్ ఫ్లైట్‌ వేరుపడుతుంది. క్యారియర్‌ నుంచి వేరు పడే సమయంలో స్పేస్ ఫ్లైట్ కూడా రాకెట్‌‌‌‌‌‌‌‌లానే నిప్పులు చిమ్ముతూ పైకి దూసుకెళ్తుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక నిలువుగా వెళ్లే ఫ్లైట్ అడ్డంగా మారుతుంది. ఆ సమయంలో ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అక్కడ దానిలోని వ్యోమగాములు జీరో గ్రావిటీ అనుభూతిని పొందుతారు. కొంత సమయం అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

కాగా, ఓ ప్రైవేటు సంస్థ మనుషులను అంతరిక్షంలోకి పంపుతుండటం ఇదే తొలిసారి. వర్జిన్ గెలాక్టిక్ అనే అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ… అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంస్థ 17ఏళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. కొన్ని ప్రయోగాలు విఫలమైనా అంతిమంగా రోదసిలోకి వెళ్లే సాంకేతికతను ఒడిసి పట్టింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపింది. నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి చరిత్ర సృష్టించింది.