వెరీ ఇంట్రెస్టింగ్ : ఈ పక్షి సగం ఆడ సగం మగ..!!

10TV Telugu News

A super rare bird showing both male and female : ట్రాన్స్‌‍జెండర్లు మనుషుల్లోనే ఉంటుందా? పక్షుల్లోను..జంతువుల్లో కూడా ఉంటుందా? అనే ఆలోచన మీకెప్పుడన్నా వచ్చిందా? బహుశా వచ్చి ఉండదు. కానీ ఈ విచిత్రమైన పక్షి గురించి తెలిస్తే నిజమా? ఇలాంటి పక్షులు కూడా ఉంటాయా? అనిపిస్తుంది.


అమెరికా పెన్సిల్వేనియాలోని పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్‌లో సెప్టెంబర్ 24 కొందరు పరిశోధకులు ఉభయలింగ పక్షిని కనుగొన్నారు. ఆ పక్షి వక్ష స్థలం (చాతీ భాగం)లో గులాబీ రంగుతో ఉంది. దీన్ని ‘‘పికిలిపిట్ట’’ అంటారట. ఈ పిట్ట పరిశోధకులను విపరీతంగా ఆకర్షించింది. సాధారణంగా పికిలిపిట్ట అని పిలిచే ఈ పక్షి శాస్త్రీయ నామం ‘‘ఫియోటికస్ లూడోవిసియానస్’’. ఈ విషయాన్ని పరిశోధకులు తెలిపారు. ఈ పక్షిలో కుడివైపు మగపక్షిలా..ఎడమవైపు ఆడపక్షిలా ఉంది.


పక్షుల్లో ఇటువంటివి చాలా అరుదుగా ఉంటాయని పౌడర్ మిల్ పరిశోధకులు తెలిపారు. అండం అసాధరణ ఫలదీకరణం కారణంగా ఈ పక్షి పుట్టి ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు.
ఇటువంటి పక్షులకు ఆడ లక్షణాలు ఉంటాయా? లేదా పురుష లక్షణాలు ఉంటాయా? అనే దానిపై స్పష్టత లేదంటున్నారు. పరిశోధనలు చేస్తేనే గానీ స్పష్టత రాదని అంటున్నారు.


ఈ పక్షులు పునరుత్పత్తి చేస్తాయా? లేదా? అనే దానిపై కూడా స్పష్టత లేదంటున్నారు. కానీ..ఈ పక్షేలు చాలా అరుదుగా ఉండడంతో వీటిపై పరిశోధన కుదరదని..పరిశోధనల్లో ఏమాత్రం తేడా జరిగినా వాటి ప్రాణానికి ప్రమాదమని అందుకే ఈ పక్షిపై స్పష్టం ఇవ్వలేమంటున్నారు. గడిచిన 64 ఏళ్లలో పౌడర్ మిల్ రీసెర్చ్ సెంటర్‌లో 10 వరకు ఇలాంటి పక్షులను గుర్తించామన్నారు.

10TV Telugu News