బిట్‌కాయిన్ స్కామ్: బిల్ గేట్స్, బరాక్ ఒబామాతో సహా హ్యాక్ అయిన పలువురి ట్విట్టర్ అకౌంట్లు

  • Published By: vamsi ,Published On : July 16, 2020 / 06:52 AM IST
బిట్‌కాయిన్ స్కామ్: బిల్ గేట్స్, బరాక్ ఒబామాతో సహా హ్యాక్ అయిన పలువురి ట్విట్టర్ అకౌంట్లు

అమెరికాలో ప్రముఖ వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలు ఒకేసారి హ్యాక్ చేయబడ్డాయి. ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ కాబడ్డవారిలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, యుఎస్ రాపర్ కాన్యే వెస్ట్, అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. అంతేకాదు వారెన్ బఫ్ఫెట్, ఆపిల్, ఉబెర్ మరియు ఇతరుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయబడ్డాయి.

ట్విట్టర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసిన తరువాత, దానిపై ఒక ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేయబడింది. క్రిప్టోకరెన్సీ కుంభకోణం కోసం ఇది జరిగిందని మెసేజెస్ నుంమచి స్పష్టం అయ్యింది. అయితే కొంచెంసేపటి తర్వాత ఈ మెసేజెస్ తొలగించబడ్డాయి.

హ్యాకర్ బిట్‌కాయిన్‌ను వర్తకం చేసేందుకు పోస్ట్‌లలో ఒక లింక్‌ను ఉంచాడు. ‘కోవిడ్-19 కారణంగా మీరు నాకు వెయ్యి డాలర్లు ఇస్తే నేను 2వేల డాలర్లు ఇస్తాను’ అని అందులో పోస్ట్ చేయబడింది. అయితే అసలు విషయం తెలుసుకున్న తరువాత, వెబ్‌సైట్ డొమైన్ రద్దు చేయబడింది. అమెజాన్ సహ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ మరియు బిల్ గేట్స్ ట్విట్టర్ హ్యాండిల్స్‌ను కూడా హ్యాక్ చేసి ఇలాంటి పోస్టులు చేశారు హ్యాకర్లు.

మన ప్రజలకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఆపిల్ ఖాతా నుండి వ్రాయబడింది. మీరు కూడా మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు పంపిన బిట్‌కాయిన్‌లు డబుల్ రిటర్న్ చేయబడతాయి. ఇది 30 నిమిషాలు మాత్రమే. కోవిడ్-19 కారణంగా, నేను ప్రజలకు డబుల్ ఇస్తున్నాను అని ఎలోన్ మస్క్ ప్రొఫైల్ నుండి వ్రాయబడింది.

తక్కువ సమయంలో, ఇటువంటి ట్వీట్లను చాలా కంపెనీలు నిర్వహించడం ప్రారంభించాయి. బిట్ కాయిన్ కుంభకోణం ఆపిల్, ఉబెర్ మరియు మరెన్నో కంపెనీల ఖాతాల నుంచి కూడా ప్రయత్నించబడింది. ఈ సంఘటన తర్వాత ట్విట్టర్‌లో కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఏ లోపం కారణంగా, ఇంత పెద్ద పేర్లుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ హ్యాక్ అయ్యాయి? దీని అర్థం ట్విట్టర్‌లో లొసుగు ఉందనే కదా? దీనివల్ల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది అని అంటున్నారు.

అదే సమయంలో, ట్విట్టర్ ఖాతా హైజాకింగ్ గురించి తెలిసినట్లుగా సంఘటన తర్వాత ట్విట్టర్ తెలిపింది. అసలేం జరిగింది అనేదానిపై విచారిస్తున్నాము. దీనిని సరిచేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. మేము త్వరలో అందరినీ అప్‌డేట్ చేస్తాము. మేము ఈ విషయాన్ని సమీక్షిస్తున్నామని తెలిపింది.