బీచ్ లో శవం..మిస్టరీ ఛేదించటానికి 70 ఏళ్ల క్రితం పాతిపెట్టిన‌ శ‌వ‌పేటిక‌ను త‌వ్విన పోలీసులు

70 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఓ వ్యక్తి శవపేటికను పోలీసులు తవ్వి బైటకు తీశారు. అతను ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు?అతని మరణానికి గల కారణం ఏమిటని తెలుసుకోవటానికి 70 ఏళ్ల క్రితం పాతి పెట్టిన శవపేటకను తవ్వి తీశారు పోలీసులు.

బీచ్ లో శవం..మిస్టరీ ఛేదించటానికి 70 ఏళ్ల క్రితం పాతిపెట్టిన‌ శ‌వ‌పేటిక‌ను త‌వ్విన పోలీసులు

Australian Mystery (1)

Australian dead body mystery :  ఎన్నో నేరాలు మిస్టరీగానే ఉండిపోతుంటాయి. అవి కాలక్రమేణా మరుగున పడిపోతుంటాయి. కొన్ని గుర్తు తెలియని కేసులుగా మిగిలిపోతే మరికొన్ని మాత్రం మిస్టరీలు ఉండిపోతాయి. అటువంటి మిస్టరీలను ఛేదించే సమయం ఎప్పుడోకప్పుడు వస్తుంది. అది 10ఏళ్లు కావచ్చు..100 ఏళ్లు కూడా కావచ్చు.  అలా ఓ వ్యక్తి మరణానికి సంబంధించిన మిస్టరీని ఛేధించటానికి ఆస్ట్రేలియా పోలీసులు 70 ఏళ్ల క్రితం చ‌నిపోయిన ఓ వ్య‌క్తి ఆన‌వాళ్లు తెలుసుకునేందుకు ఆ వ్య‌క్తిని పాతిపెట్టిన శ‌వ‌పేటిక కోసం త‌వ్వ‌కాలు ప్రారంభించారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? ఆ మిస్టరీని పోలీసులు ఛేధించారో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..

60

ఆస్ట్రేలియాలో 1948, డిసెంబ‌ర్ 1న అడిలైడ్ స‌మీపంలోని సోమ‌ర్ట‌న్ బీచ్‌లో ఓ వ్య‌క్తి శ‌వ‌ం కనిపించింది. కానీ అత‌ని పేరు..ఊరు తెలీదు. అతనెవరో తెలీదు. ఎటువంటి ఆన‌వాళ్లు తెలియ‌దు. దీంతో ఆ వ్య‌క్తి మృతదేహాన్ని అక్కడికి సమీప స్మ‌శాన‌వాటిక‌లో ఖ‌ననం చేశారు. ఆ వ్య‌క్తిని పాతిపెట్టిన స‌మాధి వ‌ద్ద గుర్తుతెలియ‌ని వ్య‌క్తి అని రాసి పెట్టారు. అయితే గుర్తు తెలియ‌ని ఆ వ్య‌క్తి గురించి ఆస్ట్రేలియాలో ఎంతో కాలం నుంచి రకరకాల కథనాలు వ్యాపించాయి.

2563

అతని చావు ఓ మిస్ట్రీగా మిగిలిపోయింది. కాలక్రమేణా అది పాతదైపోయింది. ఇన్నేళ్లకు మరోసారి అతని మరణం గురించి..అతనెవరో కనుక్కోవాల్సిన సమయం రావటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. దాని కోసం ముందుగా ఆ వ్యక్తి ఆన‌వాళ్లు కనుక్కోవాల‌నుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగటంతో డీఎన్ఏ టెక్నాల‌జీ ద్వారా అత‌ని విష‌యాల‌ను తెలుసుకుందామ‌నే ఆలోచ‌న‌తో.. అతని శ‌వ‌పేటిక‌ను తవ్వటానికి పూనుకున్నారు. 70 ఏళ్ల తరువాత ఆ శవపేటిను తీసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

14

బీచ్‌లో అత‌ని శ‌వం దొరికినా.. అత‌ని వ‌ద్ద ఎటువంటి ఆధారాలు లేక‌పోవ‌డంతో.. అప్ప‌ట్లో పోలీసులు ఏమీ చేయ‌లేక‌పోయారు. కానీ అత‌నితో సంబంధం ఉణ్న ఓ సూట్‌కేసును ఆ త‌ర్వాత అడిలైడ్ స్టేష‌న్‌లో గుర్తించారు. దాంట్లో ఉన్న లెటర్స్ చ‌దివారు. వాటిలో కూడా అతని గురించి ఎటువంటి వివ‌రాలు తెలియ‌లేదు. కానీ.. అత‌ని సూట్ కేసులో కొన్ని లవ్ లెటర్స్ ఉండటంతో బహుశా భ‌గ్న ప్రేమికుడై ఉంటాడని..ఆ బాధలోనే అతను చనిపోయి ఉంటారడని కొంద‌రు భావించారు.కొంద‌రు మాత్రం అత‌ను ఓ గూఢ‌చారి అయి ఉంటాడ‌ని అనుమానాలు వ్యక్తంచేశారు. అత‌ని వ‌ద్ద ఉన్న ఓ డైరీలో ఉన్న ఫోన్ నెంబ‌ర్ ఆధారంగా పోలీసులు అప్ప‌ట్లో అతని వివరాలు తెలుసుకనేందుకు రకరకాల యత్నాలు చేసినా ఫలించలేదు. డైరీలో ఉన్న ఆ ఫోన్ నెంబ‌ర్ జెస్సీ అనే మ‌హిళ‌ద‌ని మాత్రం గుర్తించారు.

123

అలా ఆమెను విచారించిన పోలీసుల‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన ఆ వ్య‌క్తి గురించి ఏమీ చెప్ప‌లేక‌పోయంది. జెస్సీ అనే మ‌హిళ‌కు ఓ కొడుకు ఉన్నాడు. ఆమె కొడుకు డీఎన్ఏతో ప్ర‌స్తుతం .. పోలీసులు ఆ నాడు చ‌నిపోయిన వ్య‌క్తి డీఎన్ఏతో పోల్చవచ్చని భావిస్తున్నారు. డీఎన్ఏ సేక‌ర‌ణ ద్వారా ఈ మిస్టరీ ఛేధించాలనే యోచనతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో 70 ఏళ్ల క్రితం బీచ్ లో చనిపోయిన ఆ వ్యక్తి మిస్టరీ ఈనాటికైనా ఛేదించగలరో లేదో చూడాలి.