బైడెన్, హారిస్ ప్రమాణస్వీకారం వేళ : అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

బైడెన్, హారిస్ ప్రమాణస్వీకారం వేళ : అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

Ahead Of Biden-Harris Inaugural : అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎవరో అగంతకులు బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సుప్రీంకోర్టు ఆవరణమంతా ఖాళీ చేయించారు.

అయితే అక్కడ ఎలాంటి బాంబు దొరకలేదని ఒక ప్రకటనలో అధికారులు వెల్లడించారు. బాంబు కాల్ రాగానే కోర్టు ఆవరణంలోని అన్ని పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్  నిశితంగా తనిఖీలు చేసినట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆవరణాన్ని పూర్తిగా ఖాళీ చేయించలేదని కోర్టు ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

అధ్యక్షుడిగా బైడెన్, వైస్ ప్రెసిడెంట్ గా హారిస్ ప్రమాణస్వీకారోత్సవం జరిగే యూఎస్ క్యాపిటిల్‌కు పక్కనే అతికొద్దిదూరంలోనే ఈ సుప్రీంకోర్టు ఉంది. అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులంతా క్యాపిటల్ ప్రాంగణానికి చేరుకున్నారు. బాంబు బెదిరింపుతో యూఎస్ క్యాపిటిల్ సిటీ అంతా హైఅలర్ట్ ప్రకటించారు.