రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఇండియాకు బ్రిటీష్ పీఎం

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఇండియాకు బ్రిటీష్ పీఎం

boris-johnson

Boris Johnson:జనవరి 2021 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా బ్రిటిష్ విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ కన్ఫామ్ చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తో మంగళవారం చర్చలు ముగిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు.

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కు బోరిస్ జాన్సన్ రావడం అనేది.. ఇండియా – యూకేకు మధ్యలో నూతన సంబంధాలు నెలకొల్పేందుకు ఉపయోగపడుతుందని ఎస్ జయశంకర్ అన్నారు.

పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు పీఎం మోడీ వచ్చే ఏడాది యూకే వేదికగా జరిగే G7 సదస్సుకు రానున్నారు. అంతకంటే ముందు జనవరి నెలలో జరిగే ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు ఇన్విటేషన్ అందుకున్న యూకే పీఎం జాన్సన్ ఓకే చెప్పారు. అది చాలా గొప్ప విషయం. ఇది గొప్ప విషయం.. మన సంబంధాలకు నూతన అధ్యాయం లాంటిది’ అని జయశంకర్ పేర్కొన్నారు.

రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా యూకే నుంచి వచ్చిన వారిలో జాన్సన్ ఆరో వ్యక్తి. 1993లో జాన్ మేజర్ వచ్చి వెళ్లిన తర్వాత ఇండియాకు వస్తున్న తొలి ప్రధాని జాన్సన్ మాత్రమే. గతంలో బ్రిటిష్ రాయల్ట్రీ నుంచి చీఫ్ గెస్టులుగా చాలా మందే వచ్చారు. ప్రిన్స్ ఫిలిప్ 1959లో, క్వీన్ ఎలిజబెత్ II 1961లో రాగా.. బ్రిటిష్ ఛాన్సెలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ 1956లో, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ లార్డ్ లూయీస్ మౌంట్‌బాటెన్ 1964లో చీఫ్ గెస్టులుగా వచ్చారు.

కరోనా మహమ్మారి కారణంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ను ఆర్భాటం లేకుండా ముగించేసిన ఇండియా.. రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. యూకే పీఎంకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.