గజరాజుల వేటకు లైసెన్సులు : ప్రభుత్వం వేలం పాట

అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 07:04 AM IST
గజరాజుల వేటకు లైసెన్సులు : ప్రభుత్వం వేలం పాట

అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని

అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని రూల్. బోట్స్వానా(botswana) దేశంలో మాత్రం అలా కాదు. అక్కడ ఎంచక్కా ఏనుగులను వేటాడొచ్చు. ఏనుగులను వేటాడేందుకు ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తుంది. అవును.. గజరాజుల వేట కోసం లైసెన్స్ ను వేలం వేసింది బోట్స్వానా ప్రభుత్వం.

హంటింగ్ పై నిషేధం ఎత్తివేత:
ఇటీవలే బోట్స్వానా అధ్యక్షుడు మసిసి.. హంటింగ్ గేమ్ పై నిషేధం ఎత్తివేశారు. దీంతో ఏనుగుల వేటకు లైసెన్స్ లు ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. వాస్తవంగా వేట కారణంగా అఫ్రికాలో ఏనుగుల సంఖ్య తగ్గింది. బోత్స్వానాలో మాత్రం ఏనుగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మనుషులు-జంతువుల మధ్య బేధాలు తగ్గించడానికి హంటింగ్ అవసరమే అని ప్రభుత్వం చెబుతోంది. గజరాజుల కారణంగా మనుషులు.. మరీ ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చెప్పింది. ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తున్నాయని, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అధికారులు చెప్పారు.

w

ఏనుగుల వేట కోసం ఇచ్చే లైసెన్స్ లో విషయంలో కొన్ని కండీషన్స్ పెట్టారు. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే హంటింగ్ చేయాలి. ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రర్ చేయించుకున్న కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. 
* మొత్తం ఏడు హంటింగ్ ప్యాకేజీలు ఉన్నాయి.
* ఒక్కో లైసెన్స్ తో 10 ఏనుగులు మాత్రమే వేటాడాలి
* ఏనుగుల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వేటాడేందుకు అనుమతి.
* లైసెన్స్ కోసం రూ.13లక్షలు చెల్లించాలి(రిఫండబుల్)
* 70 ఏనుగుల వేట కోసం అనుమతులు

పంట పొలాలను కాపాడుకునేందుకు:
ఇప్పటివరకు మూడు బిడ్డర్లు ఆక్షన్ లో పాల్గొనేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఒక్కో బిడ్డర్ కు ఎన్ని లైసెన్స్ లు ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బోత్స్వానా తో పాటు పొరుగు దేశాలు జింబాబ్వే, జాంబియా, నమీబియా, సౌతాఫ్రికా దేశాల్లో మనుషులు-జంతువుల మధ్య సంతులనం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా జంతువు కారణంగా ఎక్కువగా ఇబ్బందులు వస్తుంటే.. వాటిని చంపేందుకు పర్మిషన్లు ఇస్తున్నారు. జనావాసాల్లోకి తరుచుగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్న జంతువులను హత మారుస్తున్నారు.

హంటింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు:
ఏనుగులను చంపేందుకు లైసెన్సులు ఇవ్వడం పట్ల జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలను చంపే హక్కు లేదని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల.. అక్రమ వేట పెరిగే అవకాశం ఉందని వాపోయారు. పంట పొలాలను కాపాడుకునేందుకు ఏనుగులను చంపడం అనే నిర్ణయం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

9

స్థానికులు మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఏనుగులను చంపడంలో తప్పు లేదంటున్నారు. గజరాజులు తరుచుగా జనావాసాల్లోకి వస్తున్నాయని పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా.. ఎంతో మంది మనుషుల ప్రాణాలు తీశాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏనుగులను చంపడం తప్ప మరో దారి లేదన్నారు. జింబాబ్వేలో అమెరికన్ టూరిస్ట్ ఓ సింహాన్ని వేటాడి చంపడం అంతర్జాతీయ స్థాయిలో వివాదానికి దారి తీసింది. 2019లో రీసెర్చ్ ఏనుగుని కాల్చి చంపడమే కాకుండా ఆధారాలు దాచి పెట్టే ప్రయత్నం చేసిన ఇద్దరు ప్రొఫెషనల్ హంటర్స్ పై బోత్స్వానా ప్రభుత్వం నిషేధం విధించింది.