సింగ్ ల్ గా ఉన్నాడంట…డేట్ కు వస్తారా అంటూ 40వేలతో హోర్డింగ్ పెట్టేశాడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 6, 2020 / 11:09 PM IST
సింగ్ ల్ గా ఉన్నాడంట…డేట్ కు వస్తారా అంటూ 40వేలతో హోర్డింగ్ పెట్టేశాడు

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సింగిల్ గా ఉండటం,సింగిల్ గా ఉన్నందుకు బాధ పడుతుండటం చూసి ఉంటాం. వాలెంటైన్స్‌ డే దగ్గర పడటంతో సింగిల్స్‌ జోడీ కోసం వెతుకులాట మొదటుపెట్టేశారు. మనసు మెచ్చిన మగువ కోసం వెరైటీ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంగ్లాడ్ లోని ఓ సింగిల్ డేటింగ్‌ యాప్స్‌ వర్కవుట్‌ కాలేదో..మరి ఏమనుకున్నాడో ఏకంగా తనతో డేటింగ్‌కు అమ్మాయి కావాలంటూ హోర్డింగ్‌పైనే ప్రకటన ఇచ్చేశాడు. 

మాంచెస్టర్ కు చెందిన మార్క్ రోఫీ…40 వేలు ఖర్చు చేసి బిజీ రోడ్‌లో బిల్‌బోర్డుపై తన ఫోటోతో ఫోజిచ్చాడు. తాను మోస్ట్‌ ఎలిజిబుల్‌ సింగిల్‌ను అంటూ మాంచెస్టర్‌ రోడ్ లో ఈ ప్రకటనతో ముందుకొచ్చాడు. ఆ బిల్ బోర్డుపై…పడుకున్న భంగిమలో ఒక ఫోటోను ఉంచి, “సింగిల్? ఇది మీరు ఎదురుచూస్తున్న సంకేతం కావచ్చు” అని రాశాడు. బిల్‌బోర్డు ఒక్కటే కాకుండా ఏదో ఒక రాయి తగలకపోతుందా అంటూ డేటింగ్‌ మార్క్‌ పేరిట మార్క్‌ (30) ఓ వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్‌ చేశాడు.

ఈ హోర్డింగ్‌లో, అతను ఆ వెబ్‌సైట్ గురించి కూడా సమాచారం ఇచ్చాడు, ఆ వెబ్ సైట్ ద్వారా అమ్మాయిలు డేటింగ్ కోసం అతడిని సంప్రదించవచ్చంట. ఈ వెరైటీ ప్రకటనతో తనతో డేటింగ్‌ కోసం దరఖాస్తులు వస్తున్నాయని మార్క్‌ సంబరపడుతున్నాడు. అయితే మార్క్ ఐడియా అదిరిపోయిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మార్క్ కు గుడ్ లక్ చెబుతున్నారు. మార్క్ స్వయంగా బిల్ బోర్డ్ దగ్గర నిలబడి ఉన్న వీడియోను అతను ట్విట్టర్ లో షేర్ చేశాడు.