ఇండియాలో Boyfriend’s Day ఎప్పుడు? ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి?

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 04:49 PM IST
ఇండియాలో Boyfriend’s Day ఎప్పుడు? ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి?

Boyfriend’s Day 2020: గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టే జాతీయ బాయ్ ఫ్రెండ్స్ డే కూడా ఉంది. బాయ్ ఫ్రెండ్స్ కోసం ఓ రోజుని డెడికేట్ చేశారు. తన పార్టనర్ ని స్పెషల్ గా చేసేందుకు ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. మరి ఇండియాలో ఇతర దేశాల్లో బాయ్ ఫ్రెండ్స్ డే 2020 ఎప్పుడు? ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజున మీ పార్టనర్ ని అభినందించాల్సిన అవసరం ఏముంది?

నేషనల్ బాయ్ ఫ్రెండ్స్ డే 2020 డేట్:
వాస్తవానికి నేషనల్ బాయ్ ఫ్రెండ్ డే ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారు అనే విషయం తెలియదు. కానీ ప్రతి ఏటా అక్టోబర్ 3న బాయ్ ఫ్రెండ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. తన బాయ్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పేందుకు, అభినందించేందుకు గర్ల్ ఫ్రెండ్ ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. అమెరికాలో జాతీయ బాయ్ ఫ్రెండ్స్ డే జరుపుకుంటారు. అయితే మన ఇండియాలో మేల్ పార్టనర్స్ కు ప్రత్యేకంగా ఓ రోజుని డెడికేట్ చేయలేదు. అయితే ప్రేమ జంటలు తమ ప్రేమను వాలంటైన్స్ డే రోజున సెలబ్రేట్ చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే జరుపుకుంటారనే విషయం తెలిసిందే.


నేషనల్ బాయ్ ఫ్రెండ్స్ డే: చరిత్ర మరియు ప్రాముఖ్యత
నేషనల్ బాయ్ ఫ్రెండ్ డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అని కచ్చితంగా చెప్పలేము. అయితే ప్రతి ఏటా ఆగస్టు 2న నేషనల్ గర్ల్ ఫ్రెండ్ డే జరుపుకుంటారు. ఆ రోజున జంటలు ఒకరిపై ఒకరు మరింత ప్రేమ చాటుకుంటారు. తన కోసం అన్నీ చేసి పెట్టే మేల్ పార్టనర్ కి థ్యాంక్స్ చెబుతారు. మరింత ప్రేమ కురిపిస్తారు.

అమ్మాయి, అబ్బాయి మధ్య బంధం కొత్తగా ఏర్పడినది కావొచ్చు, కొన్నాళ్లుగా బంధం ఉండి ఉండొచ్చు. రొమాంటిక్ సాయంత్రాలు, డేట్ నైట్లు, అడ్వెంచర్, బంధాలు మరింత బలపడతాయి. ప్రతి ఏటా నేషనల్ బాయ్ ఫ్రెండ్స్ డే అమ్మాయి, అబ్బాయి మధ్య బంధం బలపడేందుకు తోడ్పడుతుంది. కొత్త జ్ఞాపకాలు, అనుభవాలు కలుగుతాయి. ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారి భయపడుతోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తమ పార్టనర్ ని కలిసే అవకాశం లేకపోవచ్చు. కానీ వర్చువల్ గా నేషనల్ బాయ్ ఫ్రెండ్స్ ని సెలబ్రేట్ చేసుకుని, వారిని అభినందించే అవకాశం ఉంది.