ప్రపంచంలోనే ఫస్ట్.. అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్‌ ట్విన్స్‌

ప్రపంచంలోనే ఫస్ట్.. అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్‌ ట్విన్స్‌

Brazil ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐడెంటికల్‌ ట్విన్స్‌… లింగమార్పిడి సర్జరీతో ఆడవాళ్లుగా మారారు. బ్రెజిల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

బ్రెజిల్‌కు చెందిన ఐడెంటికల్‌ ట్విన్స్‌ .. మాల్యా, సోఫియా(19)లు పుట్టుకతో అబ్బాయిలు. అయితే పెరుగుతున్న కొద్ది వారిలో మార్పులు చోటు చేసుకోసాగాయి. అబ్బాయిలుగా కంటే అమ్మాయిలుగా తమను గుర్తించుకోవటానికే ఇష్టపడేవారు.

లింగమార్పిడి సర్జరీ ద్వారా అమ్మాయిలుగా మారాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. దీనికి వారి ఫ్యామిలీనుంచి కూడా సపోర్ట్‌ దొరికింది. వీరి తాతయ్య ఆపరేషన్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు సహాయం చేశాడు. వారం క్రితం వీరిద్దరికీ ఓ రోజు తేడాతో లింగమార్పిడి సర్జరీ జరిగింది.

దీనిపై మాల్యా మాట్లాడుతూ.. నాకు నా శరీరం అంటే చాలా ప్రేమ, కానీ, నా జననాంగాన్ని ఇష్టపడేదాన్ని కాదు. నన్ను అమ్మాయిగా మార్చేయమని దేవుడ్ని ప్రార్ధించే దాన్ని అని తెలిపింది.

మగాళ్లుగా పుట్టిన కవలలు కలిసికట్టుగా “ఆడ లింగ నిర్ధారణ శస్త్రచికిత్స”చేయించుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు ఇదేనని బ్లూమెనౌలోని ట్రాన్స్‌జెండర్ సెంటర్ బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ జోస్ కార్లోస్ మార్టిన్స్ తెలిపారు.