5 నిమిషాల్లో పెళ్లి …బ్రెజిల్ లో ట్రెండ్ అవుతున్న కొత్త పద్ధతి 

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 06:20 AM IST
5 నిమిషాల్లో పెళ్లి …బ్రెజిల్ లో ట్రెండ్ అవుతున్న కొత్త పద్ధతి 

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే కుదుర్చుకున్న చాలా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కొంత మంది ఎటువంటి ఆర్భాటం లేకుండా  అనుకున్న ముహూర్తానికి సింపుల్ గా కానిచ్చేస్తున్నారు. మరికొంత మంది ప్రభుత్వం సూచించిన మేరకు నిబంధనలు పాటిస్తూ  పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తికాక ముందు అసలు పెళ్ళంటే ఆకాశమంత పందిరి భూదేవంత…అన్నట్లు జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా అంగరంగవైభంవంగా నిర్వహించుకునే వారు.

కొంతమంది వినూత్నంగా  గాలిలో, నీటిలో, కూడా చేసుకున్నారు. మరి కొందరైతే ఏకంగా వాట్సప్ వీడియో కాలింగ్ చేసుకుని, వధువు వున్న ఫోన్ కు తాళి కట్టిన వరుడి కి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయిన ఘటన చూశాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందాక  ఇప్పుడు బ్రెజిల్  లో కొత్త వివాహా పధ్ధతి అమల్లోకి వచ్చింది. అదే “డ్రైవ్ థ్రూ” వివాహ వేడుక. 

ఈ  నయా  ట్రెండ్ ఇప్పుడు బ్రెజిల్ లో బాగా పాపులర్ అవుతోంది.  కేవలం 5నిమిషాల్లోపెళ్లి తంతు ముగిసి పోతుంది.  కారులో వచ్చిన జంటలు కారు దిగకుండానే తమ ప్రమాణాలు చదివి, ఉంగరాలను మార్చుకుంటారు.  తర్వాత మాస్క్ మీదుగానే ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. దాంతో వారి వివాహం పూర్తయినట్లు అధికారులు వారికి మ్యారేజి సర్టిఫికెట్ ఇస్తారు.  ఆ తర్వాత ఆ కారు వెళ్లిపోతుంది. మరోక కారు వస్తుంది. అందులోని జంటకు అధికారులు వివాహాం జరుపుతారు.

‘పెళ్లి చేసుకోవాలని వారం క్రితం అనుకున్నాము. ఈ డ్రైవ్‌ థ్రూ వివాహ వేడుక గురించి తెలుసుకున్నాము. ఈ పద్దతి మాకు చాలా నచ్చింది. కొత్త పద్దతిలో వివాహం చేసుకోవడం చాలా బాగుంది. సంతోషంగా కూడా ఉంది అన్నారు ఇటీవల వివాహాం చేసుకున్న  బ్రెజిల్‌కు చెందిన జోవా బ్లాంక్‌, ఎరికా బ్లాంక్‌.  ఈవివాహా వేడుక పై ప్రస్తుతం బ్రెజిల్ యూత్ ఆకర్షితులవుతున్నారు.  కొన్ని చోట్ల వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా  వివాహా వేడుకలు జరుగుతుంటే  మరి కొన్ని చోట్ల ఇలా డ్రైవ్ థ్రూ  పధ్ధతిలో వివాహాలు జరుగు తున్నాయి. 

Read: తెల్ల జుట్టు మళ్లీ సహజసిద్ధంగానే నల్లగా మారే అవకాశం ఉంది, ఎప్పుడంటే