Singer Dies విమాన ప్రమాదంలో గాయని దుర్మరణం..ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని..లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. రాజకీయ నాయకులు, సాకర్ ఆటగాళ్లతో సహా ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు.

Singer Dies విమాన ప్రమాదంలో గాయని దుర్మరణం..ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల సంతాపం

Singer Marilia Mendonca Dies

singer marilia mendonca dies : బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ గాయని..లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. 26 ఏళ్ల వయస్సులోనే ఆమె మృతి చెందటం చిత్రసీమతో పాటు ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ తో పాటు మరో సహాయకుడు..మరికొందరితో కలిసి శుక్రవారం (నవంబర్ 5,2021) విమానంలో వెళుతూ ఉండగా.. ఆ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆమెతో పాటు మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు పైలట్ , కో-పైలట్ కూడా ప్రాణాలు చనిపోయారు.

బ్రెజిల్‌లోని మినాస్ గెరియాస్ స్టేట్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మరికాసపట్లో మ్యూజికల్ కన్సర్ట్‌లో అభిమానులను ఉర్రూతలూగించాల్సిన ఆమె.. విమాన ప్రమాదంలో మరణిచడం అందరినీ కలచివేసింది. ఆమె అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.26 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె మరణించం తట్టుకోలేకపోతున్నారు.మినాస్ గెరైస్ రాష్ట్రంలోని గోయానియా నుండి క‌రాటింగాకు బ‌య‌లు దేరిన విమానం ప్ర‌మాదానికి గురైంది. విమానం కూలిపోవటానికి ముందు విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టింద‌ని ప్ర‌భుత్వ రంగ విద్యుత్ సంస్థ సెమిగ్ ప్ర‌క‌టించింది. ఈ విషాద వార్తపై ఆమె అభిమానులు, రాజకీయ నాయకులు, పలువురు గాయనీ గాయకులు, సాకర్ ఆటగాళ్లతో సహా బ్రెజిల్ నలుమూలల నుండి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

మారిలియా మెండోంకా కరాటింగా నగరంలో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొనాటానికి తమ స్వస్థలమైన గోయానికా నుంచి కరాటింగాకు బయలుదేరారు. తన మేనేజర్, సహాయకులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో వెళ్లారు. కాని దురదృష్టం కొద్దీ విమానం కుప్పకూలింది. ఓ విద్యుత్ లైన్‌ను ఢీకొట్టి నేరుగా కింద పడింది. కొండ ప్రాంతంలో సెలయేరు వద్ద కుప్పకూలటంతో ఎవ్వరు ప్రాణాలతో మిగల్లేదు. ప్రమాదానికి కొన్ని గంటల ముందు విమానంనుంచే ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తున్న దృశ్యాలు, విమానం లోపల పండ్లు, స్నాక్స్ తింటున్న క్లిప్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే విమానం కూలిపోయింది. మారిలియా మెండోంకా బ్రెజిలియన్ కంట్రీ మ్యూజిక్ స్టైల్ “సెర్టానెజో” ను పాపులర్ చేసింది. 2019 లాటిన్ గ్రామీని గెలుచుకున్నారు.