బ్రేకింగ్ : ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 11:28 AM IST
బ్రేకింగ్ : ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్

కరోనా(COVID-19) దెబ్బ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి కూడా తగిలింది. ఎలిజబెత్-2 పెద్ద కొడుకుగా బ్రిటీష్ సింహానానికి వారసుడిగా ఉన్న ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బుధవారం(మార్చి-25,2020)నిర్థారణ అయింది. 1952 నుంచి ఇంగ్లాండ్ ఆధీనంలో ఉన్న కార్న్ వాల్ మరియు రొతీసే రాజుగా ప్రిన్స్ ఛార్లెస్ ఉన్నారు. 

అయితే ఇప్పటికే క్వీన్ ఎలిజబెత్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. రాయల్ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి క్వీన్ ఎలిజబెత్ బయటకు వెళ్లిపోయారు. ఆమెతో పాటు వర్కర్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసున్నారు. లండన్‌లోని ఆమె నివాసానికి చేరుకన్నారు.

93ఏళ్ల రాణి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటగానే ఉంది. బ్రిటన్ లో ఇప్పటివరకు 8వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా,422మంది ప్రాణాలు కోల్పోయారు.135మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.

See Also |కమల్‌నాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్