ఈ దుకాణాలే మహమ్మారికి జన్మస్థానాలు. అయినా మారని చైనా…యదేచ్ఛగా కుక్క మాంసం విక్రయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : June 22, 2020 / 11:16 AM IST
ఈ దుకాణాలే మహమ్మారికి జన్మస్థానాలు. అయినా మారని చైనా…యదేచ్ఛగా కుక్క మాంసం విక్రయాలు

ప్రపంచానికి శనిలా దాపురించిన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత చైనా ప్రభుత్వం కుక్క మాంసం అమ్మకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కమ్యూనిస్ట్  ప్రభుత్వం కుక్క మాంసం అమ్మకాన్ని  నిషేధించినప్పటికీ, ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. 

కుక్కలను మానవ ఆహారం యొక్క అధికారిక జాబితా నుండి తొలగిస్తూ కుక్క మాంసాన్ని నిషేధిస్తున్నట్లు గత నెలలో ప్రభుత్వం తెలిపింది. అయినా పరిస్థితి మారలేదు. మాంసం వ్యాపారులు ఇప్పటికీ కుక్క మాంసం అమ్ముతున్నారు. చైనాలో  కుక్క మాంసం తినడం ప్రస్తుతం చట్టవిరుద్ధం. అయినప్పటికీ మాంసం మార్కెట్లకు కుక్కలు వెళుతూనే ఉన్నాయి. ఇటీవల జంతు ప్రేమికులు  కొందరు యులిన్‌ మాంసం మార్కెట్లో  కుక్కలను రక్షించారు. యులిన్ లో ఉత్సవాల సందర్భంగా అక్కడ కుక్క మాంసం విచక్షణారహితంగా అమ్ముతారు.

అయితే యూలిన్ ఉత్సవాల సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో భయానకంగా కనిపించాయి. వీటిలో, కుక్కలను చిన్న బోనులలో బంధించడంతో పాటు… కుక్కల కత్తిరించిన అవయవాలతో నిండిన భాగాలు వీధుల్లో పోసి ఉన్నాయి. దీంతో జంతు ప్రేమికులు  మాంసం మార్కెట్ యజమానిపై ఒత్తిడి తెచ్చి…పోలీసుల సహాయంతో బోన్లలో బంధించిన కుక్కలను విడిపించారు. 

మాంసం మార్కెట్ నుంచి కుక్కలను రక్షించి వాటిని కొందరు ఆసక్తి కలిగిన వారికి దత్తత ఇచ్చేందుకు జంతు సంరక్షణ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. జెన్నిఫర్ చెన్ అనే కార్యకర్త కుక్కలను విడిపించేందుకు సహాయం చేసి, వాటికి సంబంధించిన చిత్రాలను, వీడియో ఫుటేజీని జంతు హక్కుల సంఘం హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్‌కు పంపాడు. చెన్ తన అనుభవాన్ని అందులో పంచుకున్నాడు. తాను మొదట కుక్కపిల్లని బోనులోంచి తీసినప్పుడు, దాని శరీరం వణుకుతోందని తెలిపాడు.

మాస్ ఫెస్టివల్స్ పేరిట రద్దీగా ఉండే మార్కెట్లు, రెస్టారెంట్లలో కుక్క మాంసం వినియోగం భారీగా ఉందని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ చైనా విధాన నిపుణుడు డాక్టర్ పీటర్ లి తెలిపారు. వివిధ జాతుల జంతువులు – రాజీపడే రోగనిరోధక వ్యవస్థ కలిగిన జంతువులు అధికంగా ఉండటం వల్ల మహమ్మారి సంభవిస్తుందని మేము అర్థం చేసుకున్నాము అని అయన తెలిపారు. 

చైనాలో మాంసం వ్యాపారంలో అక్రమంగా తరలిస్తున్న కుక్కలలో ఎక్కువ భాగం పెంపుడు జంతువులు, కాపలా కుక్కలే ఉన్నాయని కార్యకర్తలు తెలిపారు. కుక్క మాంసం వ్యాపారం నిరంతరం నవల వ్యాధుల రూపంలో ప్రజారోగ్యానికి హాని కలిగిస్తుందని ఒక ఎన్జిఓ (ప్రభుత్వేతర సంస్థ) హెచ్చరించింది. 2010నుండి యులిన్లో ఏటా నిర్వహించే కుక్క మాంసం ఫెస్టివల్ కు ముందే ఈ వారంలో ప్రతిరోజూ 400 కుక్కలు మరియు 200 పిల్లి మృతదేహాలను విక్రయిస్తున్నట్లు యులిన్‌ను సందర్శించే చైనా యాక్టివిస్టులు తెలిపారు. 

Read: కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు ఒప్పుకున్న చైనా