గ్రాండ్ ప్రపోజ్ చేద్దామనే లోపు ఇల్లంతా తగలడిపోయింది..ఎంత ఘాటు ప్రేమయో..!!

  • Published By: nagamani ,Published On : August 7, 2020 / 11:52 AM IST
గ్రాండ్ ప్రపోజ్ చేద్దామనే లోపు ఇల్లంతా తగలడిపోయింది..ఎంత ఘాటు ప్రేమయో..!!

ఎంత ఘాటు ప్రేమోయో.. గ్రాండ్ ప్రపోజ్ చేద్దామనే లోపు ఇల్లంతా తగలడిపోయింది



అది బ్రిటన్ దేశం. దక్షిణ యార్క్‌షైర్‌ ప్రాంతం.అతడు ఆమె..ఇద్దరూ ప్రేమికులు. ఆమె పేరు వలేరిజా మాడెవిక్‌. అతని పేరు ఆల్బర్ట్ ఎన్డ్రూ. ఒకరంటే మరొకరికి వల్లమాలిన ప్రేమ. ఎంతో కాలంనుచి ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ అతడికి ఓ ఆలోచన వచ్చింది. ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నాడు. ఆమె ఇంటికి రాగానే ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా..అంటూ మనస్సు విప్పి ఎంతో ఆత్రంగా..ఆశగా చెప్పాలనుకున్నాడు. అలా ప్రపోజ్ చేయటం చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాడు జీవితంలో గుర్తుండిపోయేలా..

అలా తన నెచ్చిలికి గ్రాండ్‌గా ప్రపోజ్ చేద్దామనుకుని..ఇల్లంతా కొవ్వొత్తులు పేర్చి వెలిగించాడు. రంగు రంగుల బెలూన్లతోనూ అలంకరించాడు. చక్కగా ఓ టేబుల్ వేసి..దానిపై వైన్..చఇల్లంతా ఒక్కసారి పరికించి చూసుకున్నాడు. హా..క్కగా రొమాంటిగ్ గా లొకేషన్ లా ఉంది అనుకుని హ్యాపీ ఫీలయ్యాడు. అన్ని రెడీ.. ఇక ఆమెకు పెళ్లి ప్రజోజ్ చేయటమే తరువాయి అనుకున్నాడు. అతడి మనసులోనే కాదు.. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఇల్లంతా చూసుకుని మురిసిపోయాడు. ఆ తరువాత..వేరే చోట ఉన్న తన నెచ్చెలిని వెంట బెట్టుకుని మరీ ఇంటి వద్దకు వచ్చాడు.



అంతే..!! తాను వెళ్లేటప్పుడు ఎంతో అందంగా ధగధగా మెరిసిపోయే తన ఇల్లు ఇలా మారిపోయిందేంటాని ఆశ్చర్యపోయాడు..అక్కడి దృశ్యం చూసి ఆ జంటకు నోట మాట రాలేదు. ముఖ్యంగా ఆల్బర్ట్ కైతే ముఖంలో నెత్తురు చుక్కలేకుండా పోయింది.
కారణం.. అతడి ఇల్లు మంటల్లో పడి తగలడిపోతోంది. ఆ అగ్నీకీలల్లో తన పెళ్లి ప్రస్తావన కూడా బూడిదైపోయినట్టు అతడు ఫీలయ్యాడు. బాధగా దిగులుగా అయిపోయాడు. ఇంటి ఎదురుగా ఫైర్ ఇంజిన్లుతో నానా హడావుడిగా ఉంది. చూస్తూ ఉండగానే అంతా బుగ్గైపోయింది.

ఈ ఘటనా క్రమాన్నంతా అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి ప్రస్తావన కాస్తా ఇలా ఊహించని మలుపు తిరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన నెటిజన్లు కూడా బాధపడిపోయారు. కానీ ఇంత జరిగినా ..తన ప్రేయసి తనతో పెళ్లికి ఒప్పుకోవడంతో ఇదేమంత నష్టం కాదంటూ తెగ మురిసిపోతున్నాడు ఆల్బర్ట్ ఎన్డ్రూ.