బతకాలంటే మోయాల్సిందే : గుండెను బ్యాగులో పెట్టుకుని తిరుగుతోంది పాపం..

బతకాలంటే మోయాల్సిందే : గుండెను బ్యాగులో పెట్టుకుని తిరుగుతోంది పాపం..

Britain woman to carry her heart in a backpack : ఓ అమ్మాయి తన గుండెను తన బ్యాగులో పెట్టుకుని తిరుగుతోంది. అదేంటీ గుండెను బ్యాగులో పెట్టుకుని తిరగటమేంటీ? అనే డౌట్ వస్తుంది. ఈజీగా చెప్పాలంటే..2007లో విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా వచ్చిన ‘‘ఒక్కడున్నాడు’’ సినిమా గుర్తుంది కదూ..ఆ సినిమాలో విలన్ సోనూభాయ్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ క్యారెక్టర్ తన గుండెకు సంబంధించిన బ్యాటరీ సహాయంతో పనిచేసేలా ఓ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుంటాడు.

కానీ..బ్రిటన్ లోని లండన్ లో ఉండే సెల్వా హుస్సేన్ అనే 39 ఏళ్ల మహిళ తన గుండెను బ్యాగులో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కార్డియాలజీ సమస్యలతో సెల్వాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది.

సెల్వా హుస్సేన్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెను హార్ట్ కు పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉందని గుర్తించారు. ఆమె ప్రాణాలు కాపాడ్డం కష్టమనుకున్నారు. ఎంతగానో శ్రమించారు. కానీ..ఆమె గుండె పని చేయదని నిర్ణయించారు.

చివరకు వేరే దారి లేక సెల్వా శరీరం నుంచి గుండెను తొలగించి ఆ స్థానంలో (Artificial Heart)కృత్రిమ హృదయాన్ని అమర్చారు. కృత్రిమ గుండెను ఓ బ్యాగులో అమర్చారు. ఆ బ్యాగులో ఆ గుండె నిరంతరం పనిచేయటానికి రెండు బ్యాటరీలు, మోటార్ పంపులను అమర్చారు. దాని నుంచి రెండు పైపులు ఆమె ఛాతీ భాగం నుంచి శరీరం లోపలకి వెళతాయి. బ్యాగులో ఉన్న మోటార్ సాయంతో శరీరంలోని రెండు బెలూన్లను నిరంతరం గాలిని పంపు చేస్తూ ఉండాలి.

ఆ రెండు బెలూన్లు గుండె ఛాంబర్‌లో పని చేస్తాయి. అక్కడి నుంచే రక్తం శరీరంలోని ఇతర భాగాలకు పంప్ అవుతుంది. ఇలా కృత్రిమ గుండెను నిమిషానికి 130 సార్లు కొట్టుకునేలా సెట్ చేశారు. అలా కృత్రిమ గుండెతో సెల్వాను బతికిస్తున్నాడు డాక్టర్లు. మరి అది ఎంతకాలమో తెలీదు..