పదేళ్ల చిన్నారి పాటకు ఫిదా అయిన ఏఆర్ రెహ్మాన్

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 04:44 AM IST
పదేళ్ల చిన్నారి పాటకు ఫిదా అయిన ఏఆర్ రెహ్మాన్

పిట్ట కొంచెం టాలెంట్ ఘనం. ఆ పదేళ్ల చిన్నారి గురించి చెప్పాల్సి వస్తే ఇలానే చెప్పాల్సి ఉంటుంది. 10ఏళ్ల వయసులోనే ఆ చిన్నారి అద్భుతంగా పాటలు పాడుతోంది. తన మధురమైన గాత్రంతో అందరి హృదయాలు గెలుచుకుంటోంది. ఆ అమ్మాయి సింగింగ్ టాలెంట్ ఏ రేంజ్ లో ఉందంటే, ఏకంగా మ్యూజిక్ మ్యాస్ట్రోగా గుర్తింపు పొందిన ఏఆర్ రెహ్మాన్ సైతం ఫిదా అయ్యారు. ఆ చిన్నారి గాత్రానికి రెహ్మాన్ ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, ఆ చిన్నారి పాడిన పాట క్లిప్ ను ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.

ఆ పాప పేరు సౌపర్ణిక నాయర్(Souparnika Nayar). వయసు పదేళ్లు. ఉండేది బ్రిటన్ లో. ఇటీవల బ్రిటన్స్ గాట్ టాలెంట్ లేటెస్ట్(Britains Got Talent) ఎపిసోడ్ జరిగింది. కంటెస్టెంట్ల ఎంపిక కోసం ఈ ఆడిషన్ జరిగింది. ఇందులో కంటెస్టెంట్ గా సౌపర్ణిక నాయర్ పార్టిసిపేట్ చేసింది. తన సింగింగ్ తో అందరిని అట్రాక్ట్ చేసింది. చిన్నారి గాత్రానికి జడ్జిలు పులకించిపోయారు. వావ్… ఏం వాయిస్, సూపర్బ్.. అని ప్రశంసలు కురిపించారు. ఆ పాప పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన జడ్జిలు స్టాండింగ్ ఒవేషన్ లో చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. ఈ క్లిప్ ని ఏఆర్ రెహ్మాన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా సౌపర్ణిక నాయర్ ఫేమస్ అయిపోయింది. ఒక షో తో సెలబ్రిటీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. అలాంటి దిగ్గజం ఈ పదేళ్ల చిన్నారి సింగింగ్ కు ఇంప్రెస్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా.

సౌపర్ణిక ఎంత టాలెంటెడ్ అంటే, ఆ చిన్నారి ఓ పాట పాడుతుండగా, మధ్యలో ఇన్వాల్ అయిన జడ్జి, ఆ పాటను ఆపించారు. నేను ఒక పాటను చెబుతాను, దాన్ని పాడమని కోరారు. ఆయన కోరినట్టుగానే ఆ సాంగ్ ను కూడా అద్భుతంగా సింగ్ చేసింది సౌపర్ణిక నాయర్. అంతే హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

సౌపర్ణిక సింగింగ్ టాలెంట్ చూసి నెటిజన్లు సైతం ఇంప్రెస్ అవుతున్నారు. పాట ఏదైనా ఎంతో అవలీలగా, అద్భుతంగా పాడేస్తోంది, వండర్ కిడ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఏఆర్ రెహ్మాన్ లాంటి దిగ్గజాన్ని మెప్పించడం అంటే మాటలు కాదండోయ్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు.
 

Read:  నటనలోనే కాదు చదువులోనూ బ్రిలియంటే, సమంత టెన్త్ క్లాస్ ప్రొగ్రెస్ రిపోర్టు వైరల్