Queen Elizabeth : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు రూ.1,655కోట్లు ఖర్చు

70 ఏళ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో ఉన్న ఎలిజబెత్ గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఎలిజబెత్ అంత్యక్రియలు సెప్టెంబరు 19న అధికారికంగా నిర్వహించారు.

Queen Elizabeth : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు రూ.1,655కోట్లు ఖర్చు

Queen Elizabeth

Britain Late Queen Elizabeth : బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చు అయినట్లు ఆ దేశ ట్రెజరీ ప్రకటించింది. అయితే, భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655కోట్లు ఉంటుంది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చులను ట్రెజరీ చీఫ్ సెక్రటరీ జాన్ గ్లెన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు.

70 ఏళ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో ఉన్న ఎలిజబెత్ గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఎలిజబెత్ అంత్యక్రియలు సెప్టెంబరు 19న అధికారికంగా నిర్వహించారు. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో పాటు లక్షలాది మంది ఆమెకు నివాళులర్పించారు.

Shinzo Abe funeral cost : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకంటే ఎక్కువగా షింజో అబే వీడ్కోలు ఖర్చు.. అంత అవసరమా?అంటూ ప్రజల ఆగ్రహం

ఆమె మృతి పట్ల బ్రిటన్ లో పది రోజుల పాటు సంతాప దినాలను పాటించారు. 1965లో బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ అంత్యక్రియల తర్వాత అధికారిక హోదాలో బ్రిటన్ లో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగాయి.