Prince Harry : కోర్టు బోను ఎక్కనున్న బ్రిటన్ రాకుమారుడు హ్యారీ .. 130 ఏళ్లలో ఇదే తొలిసారి..

బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ప్రిన్స్ హ్యారీ కోర్టుబోనెక్కనున్నారు. దీంతో ప్రపంచం దృష్టి ఆయనపై ఉంది.

Prince Harry : కోర్టు బోను ఎక్కనున్న బ్రిటన్ రాకుమారుడు హ్యారీ .. 130 ఏళ్లలో ఇదే తొలిసారి..

Britain's Prince Harry

Prince Harry : బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు బోను ఎక్కనున్నారు. బ్రిటన్ రాజకుమారుడు కోర్టు బోను ఎక్కటంపై 130 ఏళ్ల చరిత్రలో తొలిసారి. దీంతో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రిన్స్ హ్యారీ కోర్టు బోను ఎక్కి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో ప్రపంచం దృష్టి మరోసారి ప్రిన్స్ హ్యారీపై పడనుంది. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ III రెండో కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry), భార్య మెర్కెల్‌ (Meghan Markle)లు కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

బ్రిటన్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేసిన ప్రిన్స్ హ్యారీ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇంటర్వ్యూల్లో రాజసౌథంలో తమకు ఎదురైన సంఘటనలు చెప్పటం పెను సంచలనంగా మారాయి. పలు అరుదైన సందర్భాల్లో తప్ప అంటే హ్యారీ నాయనమ్మ క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, ఆ తరువాత తండ్రి కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సమయాల్లో మాత్రమే ఆయన బ్రిటన్ రాజసౌధానాకి వచ్చారు. వచ్చిన కార్యక్రమాలు ముగించుకుని తిరిగి అమెరికా వెళ్లిపోయారు.

 

ఇదిలా ఉంటే ప్రిన్స్ హ్యారీ కోర్టు బోనెక్కనున్నారనే వార్తతో మరోసారి సంచలనంగా మారారు. రాజకుమారుడేంటీ కోర్టు బోనెక్కటమేంటీ ఇంతకీ హ్యారీ ఎందుకు కోర్టు బోనెక్కనున్నారంటే..ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఓ వార్తా సంస్థపై వేసిన కేసులో ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం చెప్పటానికి రానున్నారు.

Prince Harry’ book “Spare,” : ‘మా అన్న నన్ను కొట్టారు’ ప్రకంపనలు రేపుతున్న బ్రిటన్ యువరాజు హ్యారీ పుస్తకం .. ప్యాలెస్ సీక్రెట్లు బట్టబయలు

బ్రిటన్ కు చెందిన మిర్రర్ గ్రూప అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకు తమపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్ హ్యారీతో పాటు 100మందికిపైగా ప్రముఖులు కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ఈకేసు విచారణ గత మేలో ప్రారంభమైంది. దీంట్లో భాగంగా సాక్ష్యం చెప్పటానికి ప్రిన్స్ హ్యారీ లండ్ హైకోర్టులో బోనెక్కి సాక్ష్యం చెప్పనున్నారు.

 

కాగా రాజకుటుంబంలో వ్యక్తులు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిన ఘటన 1870లో జరిగింది. ఓ విడాకులు కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తరువాత మరో 20 ఏళ్లకు ఓ పరువునష్టం కేసు విచారణలో భాగంగాను సాక్ష్యం చెప్పారు. ఈ రెండు ఎడ్వర్డ్ ఆయన రాజు కాకముందే జరిగాయి. రాయల్ కుటుంబం నుంచి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పటం అదే మొదటిసారి.

ఆ తరువాత అంటే 130 ఏళ్లలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పిన ఓ బ్రిటన్‌ రాజకుటుంబీకుడిగా (Britain Royal Family) ప్రిన్స్‌ హ్యారీ నిలవనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. మరోసారి ఈ రకంగా ప్రిన్స్ హ్యారీ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

 

కాగా ప్రిన్స్ హ్యారీ తల్లి యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన  డయానా అనే విషయం తెలిసిందే.డయానాకు..ఇటీవలే బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం అయిన కింగ్ చార్లెస్ లకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు విలియం, చిన్నకుమారుడు హ్యారీ.