Life Span : ఆయుష్షు పెంచే జన్యువు.. పదేళ్లకు పెంపు!

మామూలుగా మన ఆయుష్షు మన చేతుల్లో ఉండదు. కానీ, ఇప్పుడు మనిషి ఆయుష్షును పెంచుకోవచ్చు. తాజాగా బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటీలిలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు ఆ రహస్యాన్ని ఛేదించారు.

Life Span : ఆయుష్షు పెంచే జన్యువు.. పదేళ్లకు పెంపు!

life span

Life Span : సాధారణంగా మనుషులు ఆరోగ్యంగా ఉంటే వందేళ్ల వరకు జీవిస్తారు. కొంతమంది వందేళ్లకు పైబడి జీవిస్తారు. వారి గుండె ఆరోగ్యం మిగతా వారితో పోల్చితే మెరుగ్గా ఉంటుంది. మామూలుగా మన ఆయుష్షు మన చేతుల్లో ఉండదు. కానీ, ఇప్పుడు మనిషి ఆయుష్షును పెంచుకోవచ్చు. తాజాగా బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటీలిలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు ఆ రహస్యాన్ని ఛేదించారు.

శతాధిక వృద్ధుల్లో గుండె ఆరోగ్యాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లే ఓ నిర్దిష్ట జన్యువును గుర్తించారు. ఇది గుండె ఆగిపోవడం లాంటి వృద్ధాప్యంలో ముడిపడి ఉన్న వ్యాధుల నుంచి వారిని రక్షిస్తుందని, వారి హృదయాలను యవ్వనంగా ఉంచుతుందని కొనుగొన్నారు.

Air Pollution: వాయు కాలుష్యంతో ఐదేళ్ల ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు

ఈ జన్యువును భూమిపై సగటు వయసు కన్నా అధికంగా జీవిస్తున్న బ్లూజోన్ లోని ఒకినావా(జపాన్), సార్డినా(ఇటలీ), నికోయా(కోస్టారికా), ఇకార్యా(గ్రీస్), లోమా లిండా, కాలిఫోర్నియా(యూఎస్)లో నివసించే వృద్ధుల్లో కనుగొన్నారు. ఈ జన్యువు వల్లే ఈ ప్రాంతాల వారు వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నారని నిర్ధారించారు. వీరికి గుండె సంబంధిత వ్యాధులు కూడా తక్కువేనని గుర్తించారు.