Sleeping Disorder‌ : నవ్వితే చాలు ఆమెకు నిద్ర వచ్చేస్తుంది..ప్రాణాపాయం కూడా

Sleeping Disorder‌ : నవ్వితే చాలు ఆమెకు నిద్ర వచ్చేస్తుంది..ప్రాణాపాయం కూడా

Woman Laughs

woman Sleeping Disorder‌ : నవ్వటం ఓ భోగం..నవ్వించటం ఓ యోగం..నవ్వకపోవటం ఓ రోగం అన్నారు పెద్దలు. నవ్వు..ఆనందానికి ప్రతీక. మనసారా నవ్వండీ..ఆరోగ్యంగా ఉండండీ అని నిపుణులు చెబుతుంటారు. నాలుగు విధాల మంచిదని చెబుతుంటారు. కానీ నవ్వితే నిద్ర వచ్చేస్తే వింత వ్యాధి గురించి మీకు తెలుసా? నెదర్లాండ్ లోని డ్రాన్‌టెన్‌కు చెందిన 27 ఏళ్ల సెలెస్ట్‌ వాస్‌ వీనెస్‌ అనే యువతికి ఓ వింత వ్యాధి ఉంది. ఆమె కదిలేచాలు ప్రాణాలు పోతాయి. నరకం అంటే ఏంటో మంచంమీదనే అనుభవించే భయంకరమైన వింత జబ్బుతో రోజుకు 22 గంటలపాటు మంచంమీదనే జీవించే వింత వ్యాధితో బాధపడుతోందని విన్నాం. కానీ నవ్వితే చాలా నీరసం వచ్చేసి నిద్ర వచ్చేసే వింతైన వ్యాధితో బాధపడుతోంది ఓ మహిళ. ఆమె నవ్విన ప్రతిసారీ వీక్ అయిపోయి.. నిద్రలోకి జారుకుంటుది. కొన్నిసార్లు ఇది ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది కూడా.

బ్రిటన్‌ లోని బర్మింగ్‌హామ్‌ కు చెందిన బెల్లా కిల్‌మార్టిన్‌ 24 ఏళ్ల అమ్మాయి నవ్వితే చాలు నిద్రలోకి జారుకుంటుంది. అది పగలైనా అంతే రాత్రి అయినా అంతే. దీనికి కారణం బెల్లా నార్కోలెప్సీ అనే స్లిపింగ్ డిజార్డర్ (Narcolepsy Sleeping Disorder‌)‌. అదే సమస్యతో బెల్లా బాధపడుతోంది. సాధారణంగా నిద్రపోవటం చాలా హాయిగా ఉంటుంది. కానీ బెల్లాకు మాత్రం నిద్ర సమస్యగా తయారైంది. నవ్వ‌డం లాంటి బ‌ల‌మైన భావోద్వేగాల‌కు లోనైన‌ప్పుడు బెల్లా కండరాలు ఒక్క‌సారిగా బలహీనపడిపోతాయి. దీంతో ఆమెకు వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడున్నా సరే ఆమె వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. అది ఇల్లైనా అంతే వర్క్ ప్లేస్ అయినా అంతే. దీంతో అదో పెద్ద సమస్యగా తయారైంది బెల్లాకు.అలా ఆమె ఓ సారి స్విమ్మింగ్ పూల్ లో నిద్రలోకి జారుకోవటంతో ప్రాణాపాయానికి గురైంది.

కానీ బెల్లా అలా నిద్రలోకి జారుకున్న సమయంలో కూడా ఆమెకు అన్నీ తెలుస్తాయి. స్పృహ ఉంటుంది. చుట్టూ ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో అన్నీ వినిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఆమె నిద్రలో నుంచి లేవకపోతుంది. ఆ విషయాన్ని బెల్లా తెలిపింది. తనకు నవ్వు వస్తే..ఆ సమయంలో శ‌రీరాన్ని ఏ మాత్రం క‌దిలించ‌లేక‌పోతాన‌ని..దీంతో ఎక్కడుంటే అక్కడే నిద్రలోకి జారిపోతానని బెల్లా తెలిపింది. నవ్వు వస్తే చిన్న చిన్నగా నవ్వుతానని..కానీ ఆ చిన్నపాటి నవ్వుకు కూడా నిద్ర వచ్చేస్తుందని తెలిపింది.

అలా నీటిలో ఉన్నప్పుడు..ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు చాలా సమస్యలకు గురైంది. నీటిలో ఉన్నప్పుడైతే ప్రాణాపాయానికి గురైంది. దాదాపు చచ్చిబతికినట్లైంది. అది ఎందుకు జరిగేదో తెలిసేది కాదు. దీంతో బెల్లా 2015లో ఒక స్పెష‌లిస్ట్ ను సంప్ర‌తించింది. అప్పుడు తెలిసింది తాను Narcolepsy Sleeping Disorder‌ ఉన్నద‌నే విష‌యం నిర్ధార‌ణ అయ్యింద‌ని తెలిపింది బెల్లా.

దీనివల్లే కొన్నిసార్లు ప్రమాదాల బారినపడ్డానని..ఓసారి స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్నప్పుడు నిద్రలోకి జారుకోగా స్నేహితులు కాపాడారు. మరోసారి నిల్చుని ఉన్నప్పుడు నిద్రపోవడంతో కిందపడి దెబ్బలు తగిలాయి. ఇలా పలు సందర్భాల్లో..పలు రకాలుగా ఈ
Narcolepsy Sleeping Disorder‌ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నానని తెలిపింది బెల్లా. ఓసారి తల్లితో కలిసి డాబామీద ఉన్నప్పుడు ఇద్దరం ఏదో మాట్లాడుకుంటూ నవ్వాను..అంతే నిద్ర వచ్చేసింది. నియంత్రించుకోలేకపోయా..దాంతో డాబా మీద నుంచి పడిపోబోయాను..సరిగ్గా నా తల్లి పట్టుకుంది. అలా బతికిపోయాను. మరోసారి ఓ సారి వేడి వేడి టీ చేతిలో ఉండగా అదే సమస్య వచ్చింది. వేడి వేడిగా పొగలు కక్కుతున్న టీ కాస్తా ఒంటిమీద పడి కాలిపోయింది. ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని నవ్వకుండానే చెప్పింది బెల్లా. పాపం నవ్వు అనేది ఎన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తోంది. కానీ నవ్వు అనే ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేని బెల్లాది నిజంగా బాధాకరమైన సమస్య అనే అనుకోవాలి.