ఓవరాక్షన్: 6వ ఫ్లోర్ బాల్కనీ రెయిలింగ్ పై యోగాసనాలు..ముక్కలైన ఎముకలు 

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 10:52 AM IST
ఓవరాక్షన్: 6వ ఫ్లోర్ బాల్కనీ రెయిలింగ్ పై యోగాసనాలు..ముక్కలైన ఎముకలు 

యోగా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందింది. యోగాతో మానసికంగా ఉత్తేజం..శారీర ఆరోగ్యం కూడా వస్తుంది. కానీ కొంతమంది యోగాసనాలను విచిత్రంగా..ఇంకా చెప్పాలంటే వికృతంగా కూడా చేస్తున్నారు. లేనిపోని ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. ఓవర్ యాక్షన్లకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మెక్సికోలో ఓ యువతి ఏకంగా ఆరు అంతస్తుల బిల్డింగ్ పై యోగాసనాలు వేసి ప్రాణంపోగొట్టుకున్న పరిస్థితికి చేరుకుంది. బిల్డింగ్ పై యోగాచేస్తే ప్రమాదమేంటని అనుకోవచ్చు..ఆమే ఏకంగా బిల్డింగ్ బాల్కనీ రైలింగ్ మీద యోగాసనం వేసేందుకు ట్రై చేసింది. ప్రమాదవశాత్తు జారి కింద పడింది. దీంతో ఆమె బాడీలో 100పైగా ఎముకలు విరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేయించుకుంటోంది. 

అలెక్సా టెర్రాజాస్ అనే 23 యువతి మెక్సికోలోని న్యువో లియోన్‌ ఆరవ ఫ్లోర్ లో నివసిస్తోంది. తన ప్లాట్ బాల్కనీలో యోగాసనాలు వేయటం ఆమెకు అలవాటు. రోజులాగానే ఓ రోజు మధ్యాహ్నం బాల్కనీ రైలింగ్‌పై తల కిందులుగా వేలాడుతూ ఫోటోకు ఫోజులిచ్చేందుకు యోగాసనం వేయబోయింది. అంతే పట్టు తప్పింది..జారి కింద 80 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది.   

దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అలెక్సా పడిపోవటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేసి బాడీలో 100కు పైగా ఎముకలు విరిగిపోయాయని చెప్పారు. 11 గంటలపాటు సర్జరీ చేసిన వైద్యులు ఆమెను బతికించారు. పుర్రె, వెన్నముక, కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆమె బ్రతకటం చాలా అద్భుతమనీ..లేచి నడవటం చాలా కష్టమనీ..నడిస్తే కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుందని చెప్పారు. 

కాగా..అలెక్సా అలా బాల్కనీ రెయిలింగ్ పై యోగాసనాలు వేయటం చూసిన పక్క వారు గమనించి చాలా ప్రమాదకరంఅని పలు మార్లు వారించామని తెలిపారు. అయినా ఆమె వినకపోవటంతో ఇంత ప్రమాదానికి గురైందన్నారు. కాగా..ప్రమాదానికి ముందు అలెక్సా బాల్కనీ రైలింగ్‌పై వేసిన యోగాసం ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.