Bronze Age food Delivery : మూడు వేల ఏళ్ల కిందటే ఫుడ్ హోం డెలివరీ!..పరిశోధనల్లో వెల్లడైన వాస్తవాలు..!!

Bronze Age food Delivery : మూడు వేల ఏళ్ల కిందటే ఫుడ్ హోం డెలివరీ!..పరిశోధనల్లో వెల్లడైన వాస్తవాలు..!!

Bronze Age Mining Sites Received Deliveries Pre Processed Foods

Bronze Age food Delivery! : ఈ బిజీ బిజీ లైఫ్ లో ఇంటిలో వండుకుని కమ్మగా తినే తీరిక లేకపోవటం..లేదా కొత్త వెరైటీ ఫుడ్ తినాలనే ఆరాటం. దీంతో చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో స్విగ్గీనో, జొమాటోల్లో ఒక్క క్లిక్ తో ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేయటం..వెంటనే నట్టింట్లో ప్యాకెట్ వాలిపోవటం..వెంటనే వేడి చల్లారిపోకుండా లాగించేటం చేస్తున్నాం. కానీ..ఈ ఫుడ్ డెలివరీలు ఇటీవల కాలంలోనేనా? గతంలో లేవు అని చాలామంది అనుకుంటారు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు వందల ఏళ్లే కాదు వేల ఏళ్లనాటి క్రితమే ఫుడ్ హోమ్ డెలివరీలు ఉన్నాయని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది..!!

1

 

2

 

ఇలా ఫుడ్‌ ఆర్డర్‌ చేసేసి..అలా హాట్ హాట్ గా తినేటయం ఇప్పుడిప్పుడే మొదలైంది కాదని..ఎప్పుడో మూడు వేల ఏండ్ల కిందట కాంస్య యుగంలోనే ఇలా ఆహారం తెప్పించుకుని తినడం మొదలైందని ఆ్రస్టియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు తేల్చారు..!! ఆ్రస్టియాలోని ఆల్ప్స్‌ ప్రాంతంలో కాంస్య యుగం నాటి ఓ రాగి గనిలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. మార్చి 24, 2021 న ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆండ్రియాస్ హీస్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం…

3

4

అప్పట్లో గనుల్లో తవ్వకాలు చేసి రాగిని వెలికితీసేందుకు ఓ ప్రత్యేకమైన కమ్యూనిటీ ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కమ్యూనిటీ నివసించే ప్రాంతాలు, గనుల్లో వారు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో పనిముట్ల నుంచి విశ్రాంతి దాకా.. నివాసానికి అవసరమైన చాలా రకాల వస్తువులు, పరికరాలు దొరికాయి. అప్పట్లో వారు తిని వదలేసిన ఆహార పదార్థాల శిలాజాలు కూడా వారి జరిపిన తవ్వకాల్లో లభించాయి.

6

7

చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వంట వండటానికి సంబంధించిన వస్తువులుగానీ, ఏర్పాట్లుగానీ కనిపించలేదు. ఇదేమిటని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. ఈ కమ్యూనిటీ వారంతా వేరే ప్రాంతం నుంచి ఫుడ్‌ తెప్పించుకుని తినేవారని తేల్చారు. వంట రెడీ చేసి, తెచ్చి పెట్టే పనిని మరో కమ్యూనిటీ వారు చేసేవారని అంచనా వేస్తున్నారు.