#IndependenceDay: సరిహద్దులో మిఠాయిలు పంచుకున్న ఇండియా-పాక్ సైనికులు

భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏడాది కాలంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు నేడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంప్రదాయం ప్రకారం ఎర్రకోటపై జెండా ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‭నెంట్ గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

#IndependenceDay: సరిహద్దులో మిఠాయిలు పంచుకున్న ఇండియా-పాక్ సైనికులు

BSF and Pakistan Rangers exchanged sweets at the Attari Wagah border

#IndependenceDay: ఇరు దేశాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరిహద్దులో భారత్, పాకిస్తాన్ జవాన్లు మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రఖ్యాత అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఈ కలయిక సోమవారం జరిగింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినం ఆగస్టు 14, కాగా దీనికి ఒక రోజు ఆలస్యంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని సోమవారం సరిహద్దులో ఇరు దేశాల సమైక్యతను స్ఫూరించేలా భారత్‭కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పాకిస్తాన్ రేంజర్స్ మిఠాయిలు పంచుకోవడం విశేషం.

భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏడాది కాలంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు నేడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంప్రదాయం ప్రకారం ఎర్రకోటపై జెండా ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‭నెంట్ గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘‘గాంధీ, భగత్ సింగ్, రాజ్ గురు, రాంప్రసాద్ బిస్మిల్, రాణి లక్ష్మీబాయి, ఝల్కరీ బాయి, సుభాష్ చంద్రబోస్ సహా అనేక మంది బ్రిటిషర్లతో పోరాడి ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు. అలాగే జవహార్‭లాల్ నెహ్రూ, రాం మనోహర్ లోహియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా ఇతరులు దేశ స్వతంత్ర పోరాటంతో పాటు దేశాన్ని నవనూతనంగా తీర్చిదిద్దారు. వారందరికీ మనం కేవలం సెల్యూట్ చేస్తే సరిపోదు. ఈ దేశం వారెంత తపించారో, ఎన్ని కలల్ని కన్నారో ఆ కలలను సాకారం చేసుకోవాల్సి ఉంది’’ అని అన్నారు.

#IndependenceDay: ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన మోహన్ భాగవత్