BSF: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌

సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌న‌చ‌క్ సెక్టార్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ) వ‌ద్ద గ‌గ‌న‌తలంలో డ్రోను వంటి వ‌స్తువు క‌న‌ప‌డ‌డంతో స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జ‌రిపారు. దీంతో అది వెన‌క్కి వెళ్ళిపోయింది. గ‌త రాత్రి 9.30 గంట‌ల‌కు ఓ వ‌స్తువుకు సంబంధించినన లైటు గ‌గ‌న‌త‌లంలో మెరుస్తూ క‌న‌ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం కాల్పులు జ‌రిపింద‌ని అధికారులు చెప్పారు.

BSF: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌

BSF: సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌న‌చ‌క్ సెక్టార్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ) వ‌ద్ద గ‌గ‌న‌తలంలో డ్రోను వంటి వ‌స్తువు క‌న‌ప‌డ‌డంతో స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జ‌రిపారు. దీంతో అది వెన‌క్కి వెళ్ళిపోయింది. గ‌త రాత్రి 9.30 గంట‌ల‌కు ఓ వ‌స్తువుకు సంబంధించినన లైటు గ‌గ‌న‌త‌లంలో మెరుస్తూ క‌న‌ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం కాల్పులు జ‌రిపింద‌ని అధికారులు చెప్పారు.

అది భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించ‌కముందే దానిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు వివ‌రించారు. ఆ డ్రోను అప్ప‌టికే ఆ ప్రాంతంలో ఏవైనా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు, రెచ్చ‌గొట్టే సాహిత్యం వంటివి జార‌విడిచిందా? అన్న అనుమానంతో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. వేర్పాటు వాదులు, ఉగ్ర‌వాదుల‌కు డ్రోన్ల సాయంతో పాకిస్థాన్‌ ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల వంటివి పంపుతూ సాయం అందిస్తోంది.

పాక్ ప‌దేప‌దే ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డంతో దీనిపై భార‌త సైన్యం నిఘా ఉంచింది. పాక్ నుంచి వ‌చ్చిన ప‌లు డ్రోన్ల‌ను ఇప్ప‌టికే కుప్ప‌కూల్చింది. డ్రోన్ల సాయంతో దాడులు చేయాల‌ని కూడా పాక్ కుట్రలు పన్నుతోంది.

America VS China : తైవాన్ విషయంలో తలదూర్చొదంటూ..అన్‌ట్రేసబుల్ మిస్సైల్‌ తో అమెరికాకు చైనా వార్నింగ్..