రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్

రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్

రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్

రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి ఓ వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. కానీ ఓ చిన్నపాటి ట్విస్టు పెట్టింది. వెడింగ్ హాల్ పాకిస్తాన్ బహల్వపూర్‌‌లో ఉంది. రెండు, మూడు లేదా నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకొనే వారు తాము ఈ అవకాశం ఇస్తున్నట్లు ఫంక్షన్ హాల్ యజమాని వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 

దమ్ హై తో మైదాన్ మే ఆవో, దూస్రి షాదీ కర్కే దిఖావో..బంపర్ ఆఫర్ పేష్ కర్దీ అంటూ వెల్లడిస్తున్నారు. బంధాలను తాము కలపడానికి తాము ప్రయత్నిస్తామని, విడిపోవడానికి చేయడం లేదంటున్నారు యజమాని. తన దగ్గరకు చాలా మంది వస్తున్నారని, వారికి ఆఫర్ ఇస్తామన్నారు. కానీ దీనికి ఓ కండీషన్ ఉంటుందన్నారు. మరో వివాహం చేసుకొనే వ్యక్తికి భార్య ఫంక్షన్ హాల్‌కు రావాల్సి ఉంటుందని, ఆమెనే బుకింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.

కండీషన్ల ప్రకారం బుకింగ్ చేసుకొంటే వారికి తాము ఇచ్చే ఆఫర్స్ వర్తిస్తాయంటున్నారు. రెండో వివాహానికి 50 శాతం, మూడో వివాహానికి 75 శాతం, నాలుగో వివాహానికి ఉచితంగానే హాల్ అందిస్తామని వెల్లడిస్తున్నారు. 

Read More : మగవారి పొంగళ్ల వేడుక..ఆలయంలోకి మహిళలకు నో ఎంట్రీ

×