Pakistan : ఘోర రోడ్డు ప్రమాదం, 28 మంది మృతి

పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 28 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ లోని డేరా ఘాజీఖాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Pakistan : ఘోర రోడ్డు ప్రమాదం, 28 మంది మృతి

Pak

Bus Crashes in Pakistan : పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 28 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ లోని డేరా ఘాజీఖాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతులంతా కార్మికులు. బక్రీద్ పండుగ సందర్భంగా..సొంతూళ్లకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2021, జూలై 19వ తేదీ సోమవారం ఉదయం సియాల్ కోట్ నుంచి రాజన్ పూర్ కు కార్మికులు బస్సులో బయలుదేరారు.

Read More : Parliament Monsoon Session: మోదీ ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు..ఉభయసభలు మరోసారి వాయిదా

వీరు ప్రయాణిస్తున్న వాహనం ముజప్పర్ గడ్ లోని డేరాఘాజీ ఖాన్ వద్దకు చేరుకోగానే..వేగంగా వస్తున్న ట్రక్కు కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 28 మంది చనిపోగా…40 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పాక్ మంత్రి షేక్ రషీద్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.

క్షతగాత్రులకు సకాలంలో వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. పాక్ లో రోడ్ల సదుపాయం సరిగ్గా ఉండకపోవడం, ట్రాఫిక్ చట్టాలను పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరగడం ఇక్కడ సర్వసాధారణంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.