Cab Driver: జాత్యహంకార కామెంట్లు చేసే వ్యక్తి రైడ్ నిరాకరకించిన క్యాబ్ డ్రైవర్

అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకార చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి ఉండాలి" అని అన్నారు. సరిగ్గా అదే జరిగింది.

Cab Driver: జాత్యహంకార కామెంట్లు చేసే వ్యక్తి రైడ్ నిరాకరకించిన క్యాబ్ డ్రైవర్

Racist Comment

Cab Driver: అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. “జాత్యంహకార సమాజంలో జాత్యంహకార చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి ఉండాలి” అని అన్నారు. సరిగ్గా అదే జరిగింది.

ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సంస్థకు చెందిన ఓ డ్రైవర్.. రైడ్ కోసం బుక్ చేసుకున్న ఇద్దరు జాత్యహంకార కస్టమర్లకు రైడ్ క్యాన్సిల్ చేస్తూ షాక్ ఇచ్చాడు.

“పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ బయట జాకీ అనే మహిళ అతని క్యాబ్‌లో వస్తున్నట్లు రికార్డ్ అయింది. డ్రైవర్‌ను విష్ చేసిన తర్వాత, “వావ్, నువ్వు తెల్లవాడిలా ఉన్నావు” అని చెప్పింది. దీనికి బోడే, “నన్ను క్షమించు?” ఆ స్త్రీ, “నువ్వు సాధారణ వ్యక్తివా? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా?” బోడే భుజం మీద తడుముతూ కనిపించింది.

Read Also:జాత్యంహకారానికి వ్యాక్సిన్ లేదు…ట్రంప్ కి కమలా కౌంటర్

అప్పుడు బోడె ఆ మహిళను మీరు కార్ వదిలివెళ్లిపోవచ్చు. రైడ్ ను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేశాడు. అది పూర్తిగా సరైంది కాదు. ఎవరో వ్యక్తి తెల్లవాడు కాకపోయినా ఆ సీటులో కూర్చుంటే వచ్చే తేడా ఏంటి అనేసరికి ఆ మహిళ షాక్ అయింది. మళ్లీ అదే మాట వినిపించడంతో పాటు రైడ్ క్యాన్సిల్ చేసేశాడు. ఇదంతా బయట నుంచి చూస్తున్న మరో వ్యక్తి బోడెపై దాడి చేయబోయాడు.

ఈ వీడియో మొత్తాన్ని హ్యాండ్ కామ్ లో రికార్డ్ చేసిన బోడె దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

రేసిస్ట్ కస్టమర్లను తిరస్కరించడం కరెక్ట్ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలి. కాకపోతే ఇది అంత ఈజీ కాదంటూ కామెంట్లతో అభినందనలు తెలియజేస్తున్నారు.