Cadbury Beef : క్యాడ్‌బరీ చాక్లెట్స్‌లో బీఫ్..? బ్యాన్ చేయాలని డిమాండ్లు.. వివరణ ఇచ్చిన కంపెనీ

క్యాడ్‌బరీ చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ఏదైనా అకేషన్ వచ్చినా, కానుకగా ఇవ్వాలన్నా వీటినే ఎక్కువమంది ప్రిఫర్ చేస్తారు. అంతగా ఫేమస్ అయిపోయాయి ఈ చాక్లెట్స్. అయితే, ఈ క్యాడ్ బరి ఉత్పత్తులు ఇప్పుడు వివాదంలో పడ్డాయి. క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ మన దేశంలో వినిపిస్తోంది. కారణం ఏంటంటే...

Cadbury Beef : క్యాడ్‌బరీ చాక్లెట్స్‌లో బీఫ్..? బ్యాన్ చేయాలని డిమాండ్లు.. వివరణ ఇచ్చిన కంపెనీ

Cadbury Beef

Cadbury Beef : క్యాడ్‌బరీ చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ఏదైనా అకేషన్ వచ్చినా, కానుకగా ఇవ్వాలన్నా వీటినే ఎక్కువమంది ప్రిఫర్ చేస్తారు. అంతగా ఫేమస్ అయిపోయాయి ఈ చాక్లెట్స్. అయితే, ఈ క్యాడ్ బరి ఉత్పత్తులు ఇప్పుడు వివాదంలో పడ్డాయి. క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలని భారత దేశంలోని చాలామంది ప్రజలు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీని కారణం లేకపోలేదు. ఈ కంపెనీ చేస్తున్న ఉత్పత్తుల్లో జెలటిన్ ఉపయోగిస్తున్నారని .. అందుకు సంబంధించిన సాక్ష్యం ఇదే నంటూ వెబ్‌సైట్ నుండి తీసిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాడ్‌బరీ చాక్లెట్ లో ఉపయోగిస్తున్న జెలటిన్ గొడ్డు మాంసం నుంచి తయారు చేసిందనే పుకారులు షికారు చేస్తున్నాయి. దీంతో ఇది నిజమా అనే సందేహం అందరిలోనూ ఏర్పడింది.

ఇది నిజమా? అంటూ యూకే క్యాడ్‌బరీ సంస్థని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు.. ఇదే కనుక నిజమైతే.. హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను హిందువులతో బలవంతంగా తినిపించినందుకు క్యాడ్‌బరీపై కేసు పెట్టాల్సిందేనని ట్వీట్ చేశాడు. అంతేకాదు మా పూర్వీకులు, గురువులు తమ ప్రాణాలను త్యాగం చేశారే తప్ప, గొడ్డు మాంసం తినలేదు. స్వాతంత్య్రం వచ్చాక పాలకుల విధానంతో మా ధర్మం ఉపేక్షిస్తూ.. ఉల్లంఘించబడుతుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి.

వివాదం పెద్దది కావడంతో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ స్పందించింది. తమ ప్రొడక్ట్స్ లో గొడ్డు మాంసం ఉందనే ఆరోపణలపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన చేసింది. భారత్ లో తయారువుతున్న, అమ్ముతున్న అన్ని రకాల మాండెలెజ్ / క్యాడ్‌బరీ ఉత్పత్తులు 100 శాతం వెజిటేరియన్ అని స్పష్టం చేసింది. అంతేకాదు వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్.. క్యాడ్‌బరీ భారతీయ ఉత్పత్తులకు సంబంధించినది కాదని వివరణ ఇచ్చింది. క్యాడ్‌బరీ చాక్లెట్ ర్యాపర్‌పై ఉన్న ఆకుపచ్చ చుక్క శాఖాహారం అన్న విషయాన్ని సూచిస్తుందని వెల్లడించింది. ఈ స్క్రీన్ షాట్ ని షేర్ చేసేముందు ఒకసారి నిజాలు ఏంటో తెలుసుకోవాలని వినియోగదారులకు క్యాడ్ బరి డైరీ మిల్స్ సూచించింది.

ఈ ప్రచారంపై క్యాడ్ బరీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి నెగిటివ్ పోస్టులు తమ ఇమేజ్ ను బాధిస్తాయని వాపోయింది. ఇలాంటి నెగిటివ్ పోస్టులతో తమ ఉత్పత్తులపై వినియోగదారులకు ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పోస్టులు షేర్ చేసే ముందు దయచేసి ఒకసారి నిజాలు ఏంటో తెలుసుకోవాలని వినియోగదారులకు క్యాడ్ బరీ రిక్వెస్ట్ చేసింది.

క్యాడ్ బరీ బ్రిటిష్ మల్లీనేషనల్ కంపెనీ. మాండెలెజ్ ఇంటర్నేషనల్ కి చెందినది. క్యాడ్ బరీ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలంటూ వందలాది మంది ట్విట్టర్ యూజర్లు పిలుపునివ్వడంతో.. క్యాడ్ బరీ సంస్థ స్పందించింది. ఈ వివరణతో అయినా వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.