ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారానికి కరోనా పాజిటివ్

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారానికి కరోనా పాజిటివ్

California nurse ఫైజర్ కంపెనీ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ ను అమెరికాలో అత్యవసర వినియోగానికి ఇటీవల ఆమోదం లభించిన తెలిపిన విషయం తెలిసిందే. అయితే,ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తర్వాత 45 ఏళ్ల ఓ మ‌గ న‌ర్సుకు కరోనా పాజిటివ్ గా తేలింది.

కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ(45) స్థానికంగా రెండు వేర్వేరు హాస్పిటల్స్ లో నర్సుగా పనిచేస్తున్నాడు. డిసెంబర్-18న ఫైజర్ వ్యాక్సిన్ ను తీసుకున్నట్లు మాథ్యూ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపాడు. వ్యాక్సిన్ తీసుకున్న రోజు చేయి నొప్ప‌గా ఉంద‌ని, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ న‌మోదు కాలేద‌ని తెలిపాడు.

వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజుల త‌ర్వాత క్రిస్మ‌స్ రోజున మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు మాథ్యూ తెలిపాడు. హాస్పిట‌ల్‌లోని కోవిడ్ యూనిట్‌లో ప‌నిచేసిన త‌ర్వాత శ‌రీరంలో వ‌ణుకు వ‌చ్చింద‌ని, వ‌ళ్లు నొప్పులు వ‌చ్చాయ‌ని, చాలా నీర‌సించిపోయిన‌ట్లు అత‌ను ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపాడు. డ్రైవ‌ప్ హాస్పిట‌ల్‌కు వెళ్లి కోవిడ్ టెస్టింగ్ చేసుకున్న అత‌నికి క్రిస్మ‌స్ మ‌రుస‌టి రోజున పాజిటివ్ అని రిపోర్ట్ వ‌చ్చింది.

అయితే, ఇది ఊహించనిదేమీకాదని శాన్ డియోగోలోని ఫ్యామిలీ హెల్స్ సెంటర్స్ లోని అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ క్రిస్టియ‌న్ రేమర్స్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న 10-14 రోజుల త‌ర్వాత ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ అభివృద్ధి చెందుతుంద‌ని అంటువ్యాధుల డాక్ట‌ర్ క్రిస్టియ‌న్ రేమర్స్ తెలిపారు. తొలి డోసు తీసుకున్న త‌ర్వాత 50 శాతం ర‌క్ష‌ణ వ‌స్తుంద‌ని, ఇక రెండ‌వ డోసు తీసుకున్న త‌ర్వాత అది 95 శాతం ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.