జూమ్ కాల్ లో ఉన్న సంగతి మర్చిపోయిన టీచర్..జాతి వివక్షపై తిట్ల దండకం

జూమ్ కాల్ లో ఉన్న సంగతి మర్చిపోయిన టీచర్..జాతి వివక్షపై తిట్ల దండకం

California Teacher Teacher Racist Comments On Zoom Call (2)

California teacher Teacher racist comments on Zoom call  : కరోనా వచ్చిన మార్పుల్లో విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలు భాగమైపోయాయి. టీచర్లు ఆన్ లైన్ లో విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ఓ టీచర్ జూమ్ యాప్ లో ఆన్ లైన్ లో క్లాసులు చెబుతోంది. ఈక్రమంలో ఆన్ లైన్ లో ఉన్నట్లుండీ..జాతి వివక్షపై తిట్ల దండకం అందుకుంది. అటువంటివారంతా సోమరిపోతులు..పనీ పాట చేయరు అంటూ ఇష్టమొచ్చినట్లుగా తిట్టేస్తోంది.ఇంతకీ ఈ టీచరమ్మ తాను జూమ్ కాల్ లో ఆన్ లైన్ లో విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నాననే సంగతి మరిచిపోయింది. జాతి వివక్షపై తిట్ల పురాణం అందుకుంది. కాల్ ఆఫ్ చేయటం మరచిపోయి ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోయింది. తిట్ల దండకం అందుకుంది. తరువాత జరిగాల్సిందే జరిగింది. నాలుక కరచుకున్నా..ఫలితం లేకపోయింది. తాను చేసిన వ్యాఖ్యలకు ఫలితం ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది,

కింబర్లీ న్యూమన్ అనే మహిళ దక్షిణ కాలిఫోర్నియాలోని పామ్ డేల్ సిటీలో ఓ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ , సైన్స్ అండ్ టెక్నాలజీ టీచర్ గా పనిచేస్తోంది.అదే స్కూల్లో స్టోక్స్ అనే నల్లజాతి కుటుంబానికి చెందిన విద్యార్ధి చదువుతున్నాడు. కరోనా ప్రభావంతో స్కూల్ మూతపడింది.ఆన్ లైన్ లోనే విద్యార్ధులకు క్లాసులు నడుస్తున్నాయి. ఈక్రమంలో స్టోక్స్ అనే 12 ఏళ్ల విద్యార్ధి ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడలేకపోతున్నాడు. పాఠాలు అర్థం కావటంలేదు. దీంతో డౌట్స్ క్లారిటీ చేసుకోలేక సతమతమవుతున్నాడు.

దీంతో స్టోక్స్ తల్లి కటూరా స్టోక్స్ సదరు స్కూల్ యాజమాన్యానికి తన బిడ్డ పరిస్థితి తెలియజేసింది. దానికి స్కూల్ యాజమాన్యం సైన్స్ టీచర్ అయిన కింబర్లీ న్యూమన్ కు స్టోక్స్ అనే విద్యార్ధికి ఆన్ లైన్ క్లాసులో కాస్త వివరంగా బోధించాలని ఆదేశించింది. దీంతో కింబర్లీ స్టోక్స్ కు ఆన్ లైన్ పాఠాల్లో చెబుతూ కాల్ కట్ చేయటం మరచిపోయి..మరొకరితో మాట్లాడుతూ.. స్టోక్స్ కుటుంబంపై నోరు పారేసుకుంది.

వర్ణ వివక్షపై నోటికొచ్చినట్లల్లా మాట్లాడింది. స్టోక్స్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడింది.నల్ల జాతీయులనీ..తల్లీ కొడుకులిద్దరూ సోమరిపోతులనీ..ఇంకా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసింది. పిల్లల్ని పెంచటం చేతకానివాళ్లనీ..అటువంటివారు పిల్లల్ని ఎందుకు కంటారు? అనే మాటలతో పాటు తీవ్ర పదజాలాన్ని వాడింది.

అప్పటికీ జూమ్ వీడియో కాల్ ఆన్ లోనే ఉండటంతో స్పోక్స్..అతని తల్లి టీచర్ వ్యాఖ్యలకు షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని సోయ మరచిపోయి కింబర్లీ చేస్తున్న వ్యాఖ్యల్ని రికార్డు చేశారు. దీంతో కింబర్లీ జాతి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డు అయ్యాయి.ఈ వీడియో ఆధారాలతో కటూరా స్టోక్స్ స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లటంతో కింబర్లీ ఉద్యోగం కాస్తా ఊడింది.

కటూరా అక్కడితో ఆగలేదు. తనకు న్యాయం చేయమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేసింది. చిన్నారుల మనస్సుల్లో ఇటువంటి వారు జాతి వ్యతిరేక భావజాలాన్ని నాటుతున్నారని వీరి వల్ల సమాజంలో వర్ణ వివక్ష మరింతగా పెరిగే అవకాశముందని కింబర్లీ తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.దీంతో స్కూల్ యాజమాన్యానికి ఈ కేసు తలనొప్పిలా మారింది. టీచర్ కింబర్లీ కోసం యత్నించగా ఆమె ఎక్కడుందో కూడా సమాచారం లేకుండా పోయింది.దీంతో కింబర్లీని వెదికి కోర్టుకు అప్పగించాలని స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీసుల్ని కోర్టు ఆదేశించింది.