Cambodia : గేదె మాంసంలో కరోనా మూలాలు

భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

Cambodia : గేదె మాంసంలో కరోనా మూలాలు

Corona Meat

Virus Contaminated Buffalo Meat : కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. వైరస్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. భారతదేశంలో ముందుగా ఉన్న పరిస్థితి కంటే..ఇప్పుడు కొద్దిగా మెరుగు పడింది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే..భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

Read More : Tokyo Olympics 2020: పతకం వైపు మరో అడుగు.. పీవీ సింధు విజయం

ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరలా దిగుమతులకు ఒకే చెప్పింది. భారతదేశంలో ఉన్న వస్తువులు, ఇతరత్రా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో…భారత్ నుంచి గేదె మాంసం కంటైనర్లలో కంబోడియాకు ఎగుమతి అయ్యాయి. కానీ…ఈ మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు నిర్ధారించడంతో మూడు కంటైనర్లను నిలిపివేసింది. ఓ ప్రైవేటు సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు, ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించారు.

Read More : Illegal Liquor: ఫారెన్ బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లతో నకిలీ మద్యం తయారీ

కంబోడియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం కొత్తగా 685 కరోనా కేసులు నిర్ధారించారు. 19 మంది చనిపోయారు. 74 వేల 386 కేసులున్నాయి. మొత్తం వేయి 324 మంది చనిపోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.